అగ్నిమాపక డి.జీ ని కలసిన బీ.ఆర్.ఎస్ నాయకులు

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 3 మార్చి 2025
భారత రాష్ట్ర సమితి మణికొండ మునిసిపల్ పరిధిలో తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్న విషయం అందరికి విధితమే, అందుకు గాను అవసర నిమిత్తం అగ్నిమాపక నిరోధక వాహనములు అందుబాటులో లేనందు వలన, సమయానికి ప్రమాద స్థలమునకు రాకపోవడం వలన సమయస్ఫూర్తితో ప్రమాదాలను అరికట్ట లేకపోతున్నామని బీ.ఆర్.ఎస్ పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలియ పరుస్తూ, మనకు దగ్గరలో అగ్నిమాపక శాఖ సెంటర్ లేకపోవడం మన దురదృష్టంగా పరిగణిస్తు నానక్రాంగుడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐ.ఆర్.డి.ఎ ఆఫీసు వెనుక గల సంబంధిత అగ్నిమాపక దళ ఆఫీసుకు వెళ్లి సదరు అధికారి అయిన డైరెక్టర్ జనరల్ ఫైర్ సర్వీస్ నాగిరెడ్డిని కలసి తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో అభివృద్ధికి మారుపేరైన మణికొండ గురించి ప్రస్తావిస్తూ రెండు లక్షల పై చిలుకు జనాభా గలిగిన మణికొండ పరిసర ప్రాంతాలలో ఫైర్ సర్వీస్ లేని లోటును తెలియపరుస్తూ వెంటనే సెంటర్ ను ఏర్పాటు చేయమని వినతి పత్రం అంద జేయడం జరిగిన దరిమిలా వెంటనే ప్రతిస్పందించి అందుకు తగ్గ చర్యలు తీసుకొంటానని సమాధానం ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, వర్కింగ్ ప్రెసిడెంట్ కుంబగళ్ళ ధనరాజ్, ముఖ్య కార్యదర్శి గుట్టమీది నరేందర్, సీనియర్ నాయకులు అందె లక్ష్మణ్ రావు, గోరుకంటి విఠల్, ఉపేందర్నాధ్ రెడ్డి, సంఘం శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, యాలాల కిరణ్, కందాడ ప్రవీణ్, సుమనళిని, షేక్ ఆరిఫ్, ఆరీఫ్ మహమ్మద్, సుమన్, యాలల బెన్నీ, అశ్వక్ అలి, శేఖర్ తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking