మణికొండలో బీ.ఆర్.ఎస్ ప్రజాభిప్రాయ సేకరణ.

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 3 మార్చి 2025
భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ మునిసిపాలిటీ పరిధిలో కార్యకర్తలు గుడ్ మార్నింగ్ మణికొండ పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ఇంటింటికీ ప్రతి ఇంటికి ప్రతీ రోజు ఒక చోట తిరుగడంలో భాగంగా పుప్పాలగూడ నార్శింగి రోడ్డులో గల స్కైలా అపార్ట్మెంట్ ప్రక్క వీధిలోని కులీ కుతుబ్ షాహీ నగర్ కాలనీ ప్రాంతంలో నివసించే మిత్రులు ఎదుర్కుంటున్న సమస్యలు తెలుసు కోవడానికి గుట్టమీది నరేందర్, కృష్ణ రాజీల ఆహ్వానం మేరకు స్థానిక పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఆద్వర్యంలో వెళ్ళడం జరిగినదని, అందులో భాగంగా మంచి నీటి సరఫరా రెండు రోజులకు ఒకసారి కేవలం అరగంట మాత్రమే రావడం వలన, పూర్తిగా నీటి టంకర్లపై ఆద్దారపడ వలసి వస్తుందని దరిమిలా టంకర్ల రేటు పెంచినను ఎక్కువ డబ్బులు కట్టి వాడకానికి నీరు కొనవలసి వస్తుందని వారి బాదలను తెలియ పరుస్తూ వారికి తగిన సహాయ సహకారాలను అందించడానికి అండగా ఉండమని తెలియ పరచినారు. స్థానికుల పిర్యాదు మేరకు ముష్కం చెరువు మొత్తంగా చెత్తా చెదారం వేయడం ద్వారా దుర్గంధంతో కూడిన దోమల బెడద తీవ్రంగా ఎదుర్కుంటున్నామని, ఇలాగే వదిలి వేస్తే ఇట్టి చెరువు త్వరలోనే అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉందని తెలుపుతూ సంబంధిత అధికారులకు తెలియ చేసి పరిష్కారం మార్గం కనుక్కోవాలని. రాత్రి కాగానే వీధి దీపాలు పనిచేయనందు వలన దొంగల బెడదకు భయ పడుతున్నామని, దానికి తోడు సీసీ కెమెరాలు పనిచేయ నందు వలన దిక్కు తోచడం లేదని కావున తగిన పరిష్కారం చేయ వలసినదని. ఇట్టి ప్రజాభిప్రాయ సేకరణలో ఏర్పుల శ్రీకాంత్,
గోరుకంటి విఠల్, మాల్యాద్రి నాయుడు, ఉపేందర్నాధ్ రెడ్డి, సంఘం శ్రీకాంత్, షేక్ ఆరిఫ్, కందాట ప్రవీణ్, సుమనళిని, బొడ్డు శ్రీధర్, రమణ మూర్తి, భాస్కర్ గౌడ్, రేఖ, రామాంజనేయులు, పవన్ తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking