కవిత పింక్ బుక్ లో బీఆర్‌ఎస్ నేతల స్కాంల గురించి రాయాలి
టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్
గాంధీ భవన్‌టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం విూడియాతో మాట్లాడారు. I ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. అడుగడుగునా బీజేపీ కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైందవుడిలా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణపై నిత్యం విషం చిమ్ముతున్నారు. బిజేపి బిఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందం లో భాగంగానే కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి మోకాలడ్డుతున్నారు. బీజేపీ 8 మంది ఎంపీలు తెలంగాణ అభివృద్ది కోసం ఏనాడైనా ప్రధాని మోదీని కలిసి చర్చించారా అని ప్రశ్నించారు. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిస్తే కేంద్రంను ఒప్పించి నిధులు ఎందుకు తీసుకురావడం లేదు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగుతుంది. కేంద్రం వైఖరితో మెట్రో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూసి ప్రక్షాళనకు కేంద్రం ఎందుకు సహకరించడం లేదు. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ గురించి కూడా రాజకీయాలు చేయడం సిగ్గు చేటు. ఆదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్ ఎయిర్ పోర్ట్ లు పెండిరగ్ లోనే ఉన్నాయి. కిషన్ రెడ్డి ని సూటిగా అడుగుతున్నా.. తెలంగాణ అభివృద్ధి గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సహకరించలేదని బీజేపీ కేంద్ర మంత్రులే చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అన్ని విధాలా కేంద్రానికి సహకరిస్తున్నా రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న రఘునందన్ రావు పాచికలు పార్టీలో పారకపోవడంతో దిక్కుతోచని స్థితిలో తెలంగాణలో పాలన పడకేసిందంటూ కాంగ్రెస్పై నిరాధర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
బీసీ బిడ్డ బండి సంజయ్ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి, అగ్రవర్ణాల వారికి ఇచ్చినప్పుడు రఘునందన్ రావు ఎందుకు మౌనం దాల్చారు..? కవిత పింక్ బుక్ అంటున్నారు..మొదట అందులో వారి పార్టీ నేతల స్కాంల గురించి రాయాలి మహిళలను స్వయం ఉపాధిలో ప్రభుత్వం బలోపేతం చేస్తున్నందుకు కవిత ఉద్యమబాట పట్టారా..? Iముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ వర్గాల మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నా కవితకు కనిపించడం లేదా..? మహిళలు ఒకరి విూద ఆధార పడకుండా స్వయం ఉపాధితో సొంత కాళ్ల బీద నిలబడేలా వారికి ప్రెటోల్ బంకులు కేటాయించినందుకు కవిత ఉద్యమిస్తున్నారా..? పాఠశాలల, హాస్టళ్లలోని పిల్లల యూనిఫాంలను కుట్టే వ్యాపారాన్ని మహిళలకు కట్టబెడుతున్నందుకు కవిత ఉద్యమిస్తున్నారా..? Iఆడబిడ్డల పేరు విూద 4.50 లక్షల పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుందనందుకు కవిత ఉద్యమిస్తున్నారా..? Iఇందిరమ్మ మహిళా క్యాంటీన్లతో మహిళలకు స్వయం ఉపాధి కల్పించినందుకు కవిత ఉద్యమిస్తున్నారా అని ప్రశ్నించారు.