బిజెపి పార్టీలో చేరిన దండేపల్లి మండలంలోని బీఆర్ఎస్ ఎంపీటీసీలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 03 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ ఎంపీటీసీ చుంచు మల్లవ్వ – లక్ష్మి నారాయణ లింగపూర్ ఎంపీటీసీ బొడ అమృత – నర్సింగ్ నాయక్ బుధవారం రోజు బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సమక్షంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీటీసీ లు మాట్లాడుతూ…మంచిర్యాల నియోజకవర్గంలో అభివృధి కేవలం రఘునాథ్ నాయకత్వంలో జరుగుతుందనే నమ్మకంతో బిజెపి పార్టీలో చేరడం జరిగింది అని ఎంపీటీసీలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజిని కాంత్, కృష్ణ మూర్తి,బీజేపీ దండేపల్లి మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య,గుండ ప్రభాకర్,గుండ రవీందర్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వనపర్తి రాకేష్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking