వెంకట్రావుపేటలో నులిపురుగుల దినోత్సవం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 03 మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నులిపురుగుల నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ… విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై శ్రద్ధ వహించగలరని అన్నారు. మండలంలోని 1 నుండి 19సం. రాల వయసు గల 12482 విద్యార్థులకు గాను 11583 మందికి అల్బెండోజోల్ 400 ఎంజి మాత్రలను అందజేసినట్లు తెలిపారు.ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు,కళాశాలలు, అంగన్వాడి సెంటర్లతో కలిపి 93శాతం పూర్తిచేశమన్నారు. మండలంలోని చందారం సబ్ సెంటర్ లో ఎంపీపి అన్నం మంగ చిన్నన్న, లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య చేతులమీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సీ ఎచ్ ఓ దీక్షిత ,ఎచ్ఈఓ లక్ష్మణ్ స్వామి,సూపర్ వైజర్లు రత్నకుమారి,శాంతకుమారి, మార్త, హెల్త్ అసిస్టెంట్లు యం. ఏ.గఫూర్,వేణు, ఎమ్ ఎల్ ఎచ్ పీ లు,ఎ ఎన్ ఎమ్ లు , ఆశాకార్యకర్తలు,అంగన్ వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking