పల్లా రాజేశ్వర్ రెడ్డినీ కలిసిన 108 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లకావత్ బాలాజీ నాయక్

 

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా ఆగస్టు3:తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగులకు న్యాయం జరిగే విదంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి జీతాల పెంపు మరియు 4వ స్లాబ్ అమలు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగుల తరపున పల్లా రాజేశ్వర్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా 108 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లకావత్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ మేము ఎల్లప్పుడూ పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విదంగా సేవలు అందిస్తున్నాము అని అన్నారు.భూమి మీద మానవజాతి మనుగడ ఉన్నంతవరకు 108 సేవలు అవసరం అని అన్నారు.కావునా మా యందు దయవుంచి మాకు పూర్తి న్యాయం జరిగే విదంగా తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి 108 సేవలను ప్రభుత్వ పరిదిలోకి తీసుకుని 108 ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపాలని తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగ సంఘా నాయకులు కోరారు. కలిసిన వారిలో ప్రధాన కార్యదర్శి బోయినపల్లి దేవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking