కంటి వెలుగును ప్రారంభించిన బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి

 

మణికొండ మున్సిపల్ కౌన్సిల్ 19వ వార్డులోని మణికొండ గార్డెన్ కమ్యూనిటీ భవనము నందు కంటి వెలుగు కార్యక్రమంను మణికొండ బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, స్థానిక కౌన్సిలర్ కె. రామకృష్ణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా రామకృష్ణ రెడ్డి మాట్లాడుతు కంటి వెలుగు ద్వారా ప్రవేటు ఆసుపత్రిలలో కంటి వైద్య పరీక్షలు, వైద్యం చేసుకోలేని వారు కెసిఆర్ ప్రభుత్వం ఉచితంగా కంటీ వేలుగు ద్వారా కంటి పరీక్షలు చేసుకొని అవసరమైన వారికి కంటి అద్ధాలు, ఆపరేషన్ ఉచితంగా చేస్తున్న దేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మాల్లా రెడ్డి, మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బుద్దొళ్లు శ్రీరాములు, కౌన్సిలర్ వసంత్ చౌహన్, నాయకులు పుల్లారావు, ఏర్పుల కుమార్, శ్రవణ్, ఆరిఫ్, గంఘధర్ మరియు కాలనీ వాసులు సత్యనారాయణ, శ్రీనివాస్, రామకృష్ణ రెడ్డి, మున్సిపాలిటీ సిబ్బంది మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking