ఐక్యతతోనే మాలల అభివృద్ధి

 మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి

జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్ 10( ప్రజా బలం )మాలలందరు ఐక్యంగా ఉంటేనే  అభివృద్ధి సాధ్యం అవుతుందని  మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి అన్నారు. సోమవారం మాలమహనాడు యువత ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి రవి నియామకాన్ని చేపట్టిన అనంతరం మ్యాదరి శ్రీహరి మాట్లాడారు. అంబేద్కర్ అంటే కేవలం ఒక రాజ్యాంగానికి పరిమితం కాదని ఆర్బీఐ కె దిశా నిర్దేశం చేసిన మహనీయుడన్నారు. మహిళలకు పురుషులతో సమాన హక్కు ఉండాలన్న ఉద్దేశంతో హిందుకోడ్ బిల్లును ప్రవేశపెట్టారన్నారు. అంటరాని తనాన్ని రూపుమాపడానికి కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని ఏకమై హక్కులు సాధించుకోవాలని  శ్రీహరి పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరాల మహేష్, యువజన ప్రధాన కార్యదర్శి ఎర్ర గోకుల కీర్తి కుమార్,  రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్ర రాజు, జనరల్ సెక్రెటరీ చింతకుంట్ల గంగాధర్, మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షులు కోడిపెల్లి విష్ణు, రూరల్ మండల అధ్యక్షులు రాకేష్, నాయకులు తరాల చిన్న గంగన్న, కోడిపెళ్లి భోగి కుమార్, రాజు, సి పెళ్లి చందు తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking