లక్షెట్టిపేట మండలంలో విజయవంతంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 10 : బీఆర్ఎస్ రాష్ట్రసమితి అధిష్టానం ఆదేశాల మేరకు లక్షెట్టిపేట మండలంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం విజయవంతంగా జరిగింది.మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల,ఆసిఫాబాద్ నియోజకవర్గాల ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ మాట్లాడారు.ఈ సందర్భంగా నారదాసు లక్ష్మణ్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఎలాంటి మధ్య వర్తిత్వం లేకుండా పార్టీలకతీతంగా ప్రతి గడపగడపకు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతుబంధు,రైతు బీమా,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లు,కెసిఆర్ కిట్లు,సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు,స్మశాన వాటికలు వంటి సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు తో పాటు మన ఊరు మనబడి మండలంలో పాఠశాలలను మౌలిక వసతులు కల్పిస్తూ ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు.అంతకుముందు ఎమ్మెల్యే మాట్లాడుతూ…కెసిఆర్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని అన్నారు.పేద ప్రజల అభ్యున్నతికి పాటు పడే పార్టీ ఏదైనా ఉన్నదంటే ఒక బీఆర్ఎస్ పార్టీ అని చెప్పక తప్పదని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ కుమార్,డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు,ప్రజా ప్రతినిధులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking