శివాలయా నిర్మాణానికి కారుకూరి బ్రదర్స్ 5 గుంటల భూమి విరాళం డాక్టర్ శ్రీనివాస్ వర్మ 1 లక్ష రూపాయలతో బోర్ వెల్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 09 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో శివాలయం నిర్మాణం కోసం కీ,,శే,,కారుకూరి పెద్ద రాజయ్య కుమారులైన కారుకూరి తిరుపతి,కారుకూరి సురేందర్ న్యాయవాది,కారుకూరి భూమన్న,5 గుంటలు భూమి సుమారు10 లక్షల రూపాయల విలువ గల భూమిని ఇవ్వడం జరిగింది. శివాలయం నిర్మాణంలో భాగంగా వర్మ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మోటపలుకుల శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో 1 లక్ష రూపాయలతో బోర్ వెల్ వేయించడం జరిగింది.ఈ సందర్భంగా కారుకూరి బ్రదర్స్ మాట్లాడుతూ…శివాలయం నిర్మాణం కోసం విరాళం లో బాగం డాక్టర్ శ్రీనివాస్ వర్మ 1 లక్ష రూపాయలతో బోర్ వెల్ విరాళం గా వేయించడం అభినందించారు,అంతేకాకుండా ఎవరైనా విరాళాలు సేకరించి శివాలయ గుడి సహకరించాలని కోరారు,అనంతరం వర్మ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ… శివాలయా నిర్మాణానికి 5 గుంటల భూమిని విరాళం అందించిన కారుకూరి బ్రదర్స్ ను అభినందించారు.కాకుండా శివాలయ గుడి నిర్మాణానికి దాతలు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్దసాని మౌళి సార్ మోటపలుకుల గట్టయ్య,తిరుపతి,డాక్టర్ సత్తయ్య,కారుకూరి సత్తయ్య,తిరుపతి, చిన్న మల్లేష్,కొట్టే శ్రీనివాస్,సంగతి మనోజ్,ముద్దసాని రమేష్,చిరుత తిరుపతి,గొల్ల బాపు,తదితరులు పాల్గొన్నారు.