మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 10:
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ అంశాలపై 89 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి , జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, తో కలిసి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వాటికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి సమస్యలు పరిష్కరించి సంబంధిత వెబ్ పోర్టల్ లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. తమ పరిధిలో లేని వాటిపై ఫిర్యాదీదారులకు తగు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.