ఏప్రిల్ 17న T-SAVE ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

 

– పెద్ద ఎత్తున హాజరుకానున్న ప్రతిపక్షాలు, విద్యార్థి, ప్రజాసంఘాలు

– ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వెల్లడి

– T-SAVE కు మద్దతు తెలిపిన సంఘాలకు, పార్టీలకు ధన్యవాదాలు తెలిపిన వైయస్ షర్మిల గారు

నిరుద్యోగులు, విద్యార్థుల కోసం చేపడుతున్న T-SAVE పోరాటంలో భాగంగా ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ప్రతిపక్షాలు, వామపక్షాలు, విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. వైయస్ షర్మిల గారు T-SAVE యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, NSUI రాష్ట్ర అధ్యక్షులు బలమూరి వెంకట్ గారు, ప్రజా గాయకుడు గద్దర్ గారు, సీపీఐ నేత, AIYF రాష్ట్ర అధ్యక్షుడు వలీ గారు, గిరిజన శక్తి నాయకులు శరత్ నాయక్ గారు, BC యునైటెడ్ ఫ్రంట్ రామకృష్ణయ్య గారు, సీపీఐ (ML) న్యూ డెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకటరామయ్య గారు, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షులు ఉషా కిరణ్ గారు, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుశీలా బాయి గారు, PDSU రాష్ట్ర అధ్యక్షులు మహేశ్ గారు, బీసీ సంఘం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కోన జనార్ధన్ గారు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల గారు మాట్లాడారు.

-. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం పోరాడటం మన నైతిక భాధ్యత

-. రాజకీయాలకు, సిద్ధాంతాలను పక్కన పెట్టి కలిసి పోరాటం చేస్తున్నాం

-. మనం ఉద్యమిస్తే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ను మనం కాపాడే వాళ్ళం అవుతాం

-. అందుకే T – SAVE ఫోరం ఏర్పాటు చేశాం

-. T – SAVE ద్వారా ఉద్యోగాలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, హాస్టళ్లలో వసతులు తదితర అంశాల మీద పోరాటం చేస్తాం

-. తెలంగాణలో కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పడి దాదాపు 3.85లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుంది

– బిస్వాల్ కమిటీ రాష్ట్రంలో 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పింది

-. కానీ కేసీఅర్ అసెంబ్లీ లో నిలబడి 80 వేల ఉద్యోగాలు భర్తీ అని రెండేళ్ల క్రితం చెప్పాడు

-. 80 వేల ఉద్యోగాలు అని ఇప్పటి వరకు 43 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ లు ఇచ్చారు

-. 80 వేల ఉద్యోగాలలో ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ కాలేదు

-. పేపర్ లీకుల కారణంగా గ్రూప్ 1 లాంటి పరీక్షలు గందరగోళం లో పడ్డాయి

-. ఉద్యమంలో ఇంటికి ఒక ఉద్యోగం అని కేసీఅర్ హామీ ఇచ్చాడు

-. గ్రూప్ 1 పోస్టులకు పరీక్షలు రాయోద్దు అన్నారు

-. కేసీఅర్ మెడలు వంచాల్సిన అవసరం ఉంది

-. ఈ నెల 17 న 48 గంటల పాటు నిరాహార దీక్ష చేద్ధం

-. అన్ని పార్టీలు,సంఘాలు కలిసి సచివాలయ ముట్టడికి పిలుపు నిద్ధం

-. 1.91 లక్షల ఉద్యోగాలు తక్షణం భర్తీ చేయాలి

-. మండలానికి ఒక స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి

-. ప్రతి నిరుద్యోగికి వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలి

-. 10 లక్షల మంది యువత కి కార్పొరేషన్ తరుపున లోన్లు వెంటనే విడుదల చేయాలి

-. కేంద్రం ఇస్తామని చెప్పిన 2 కోట్ల ఉద్యోగాల విషయంలో తెలంగాణ యువత కి బీజేపీ సమాధానం చెప్పాలి

-. తెలంగాణ లో బాకీ పడిన ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

-. 20 లక్షల మంది విద్యార్థులకు 5 వేల కోట్లు తక్షణం చెల్లించాలి

-. TSPSC పేపర్ లీకుల పై తక్షణం CBI దర్యాప్తు చేయించాలి

-. వెంటనే TSPSC బోర్డ్ రద్దు చేయాలి

-. బోర్డ్ మీద నమ్మకం పోయింది కాబట్టి… ఉద్యోగాలు వేరే ఇతర బోర్డ్ వేసి తక్షణం నియామకాలు చేపట్టాలి

 

అద్దంకి దయాకర్
అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ

-. విద్యార్థుల కోసం రాజకీయాలు పక్కన పెట్టాలి

-. ఎవరు ఏర్పాటు చేసినా అందరం కలిసి నిరుద్యోగుల పక్షాన పోరాడాలి

-. వేదిక ఏదైనా అందరం కలిసి కట్టుగా కార్యాచరణ ప్రకటించాలి

-. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు

-. రెండు కోట్ల మంది యువత ఉంది

-. కేటీఆర్ ఒక పనికి మాలిన చెత్త మంత్రి

-. ఉద్యోగాలు లేవు కానీ.. ఒక్కొక్క గ్రామంలో 6 బెల్ట్ షాపులు ఉన్నాయి

-. గల్లీ నుంచి ఢిల్లీ దాకా లిక్కర్ వ్యాపారం

-. TSPSC పేపర్ లీకు అయితే నాకేం సంబంధం అంటున్నారు

-. కేటీఆర్ ఒక దరిద్రుడు,సన్నాసి

-. ఐటీ శాఖ మంత్రి గా ఉండి పేపర్ లీకు అయితే సంబంధం లేదు అంటావా

-. YSR హయాంలో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి

-. రాజన్న బిడ్డ గా షర్మిలమ్మ పోరాటం చేస్తుంది

-; రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు కాదు.. 2.20లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి

-. కేసీఅర్ ఒక దమ్ములేని ముఖ్యమంత్రి

-. ఒక్క ఉద్యోగం కూడా పెంచలేని దద్దమ్మ

-. రాష్ట్రంలో ఏ శాఖ చూసినా ఉద్యోగాల కొరత ఉంది

-. 4 లక్షల కోట్ల బడ్జెట్ అంటున్నారు..ఎక్కడ ఉద్యోగాలు

-. ఆనాడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనే 2 లక్షల కోట్ల తో 23 జిల్లాలు వైఎస్సార్ నడిపించారు

-. తెలంగాణ లో మొత్తం కుంభకోణాలు

-. భూదాన్ కింద లక్ష ఎకరాలు కబ్జా చేశారు

-. కాళేశ్వరం,మిషన్ కాకతీయ ఇలా అన్ని ప్రాజెక్ట్ లు కుంభకోణమే

-. కేసీఅర్ తెలంగాణ వాడు కాదా..?

-. 2024 ఎన్నికలకు మొత్తం ధనం ఇస్తాడట

-. ఎక్కడ నుంచి వచ్చాయి కేసీఅర్ కి ఇన్ని డబ్బులు

-. సిద్ధాంతం పరంగా కమ్యునిస్ట్ పార్టీలు దొరకు వ్యతిరేకంగా పోరాడాలి

-. దొరకు అమ్ముడు పోయినట్లు ఎందుకు చేస్తున్నారు..?

-. తమ్మినేని వీరభద్రం కు విద్యార్థుల రోదన కనపడటం లేదా..?

-. షర్మిల ఈ ప్రాంతం బిడ్డ కాదు అని అంటారు..మరి కమ్యునిస్ట్ లు ఏం చేస్తున్నారు

-. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు

-. TSPSC కరెక్ట్ అయితే.. 4 పేపర్లు లీకు అయ్యే దాకా ఎం చేస్తున్నారు

-.T – SAVE ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం

బలమూరి వెంకట్
NSUI అధ్యక్షుడు

-. మార్కెట్ లో TSPSC పేపర్లను పల్లి బఠాణీ అమ్మినట్టు అన్నారు

-. బయటకు వచ్చే వరకు అది TSPSC పేపర్ అని తెలియదు

– సీట్ ఇంకా దర్యాప్తు సాగుతూనే ఉంది

-. సిట్ ఇంకా దోషులను నిర్ధారించక ముందే KTR దోషులను ప్రకటన చేశాడు

-. సిట్ దర్యాప్తులో తెలియని దోషులు కేటీఆర్ కి ఎలా తెలుసు

-. కేటీఆర్ హస్తం ఉందని చెప్తే కేసులు పెట్టారు

-. పరువు నష్టం దావా వేశారు

-. నిరుద్యోగులకు బరోసా ఇచ్చే విధంగా ఒక్క నిర్ణయం లేదు

-. TSPSC లో ఇంత పెద్ద తప్పు జరిగితే ఒక్క కనీసం చర్యలు లేవు

-. నైతిక బాధ్యత వహించి అయినా బోర్డ్ రద్దు చేయలేదు

-. దర్యాప్తు మొత్తం దారి మళ్లింది

-. దొంగలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు

-. రాజకీయాల ప్రయోజనం కోసం పేపర్ లీక్ స్కాం పక్కకు నెడుతున్నారు

-. BRS మీద బీజేపీ…బీజేపీ మీద brs ఆరోపణలు తప్పా మరోటి లేదు

-. కేసీఅర్ కుటుంబ పాలన పై కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది
అఖిలపక్షం సమావేశం అప్డేట్

గద్దర్
ప్రజా ఉద్యమ నాయకుడు

-. రాష్ట్రంలో ఐక్య కార్యాచరణ అవసరం ఉంది

-. YSR తో ఆనాడు చాలా అనుభవం ఉంది

-. భావ సారూప్యత తో పాటు..ఐక్య సారూప్యత కూడ అవసరం ఉంది

-. కట్టింది కూలగొట్టు…మళ్ళీ కొట్టు..కమీషన్ పట్టు అనేలా ఉంది పాలన

-. ఆనాడు ప్రజల అవసరంగా ఉండేది YSR పాలన

-. ఇంటికి పోతే స్వయంగా YSR చాయ ఇచ్చాడు

-. ఎటువంటి సమస్యలు ఉన్నా..లోపలకు పిలిచి సమస్య పరిష్కారం చేశాడు

-. తెలంగాణ లో 2 కోట్ల యువత ఏకం కావాలి

-. యువత ఏకం అయితే కేసీఅర్ పేక మేడ కూలిపోతుంది

వేములపల్లి వెంకట్ రామయ్య
CPI( ML – న్యూ డెమోక్రసీ)

-. బీజేపీ 2 కోట్లు ఉద్యోగాలు అని మోసం చేసింది

-. కేసీఅర్ ఉద్యమంలో ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు

-. 9 ఏళ్లలో వాగ్ధానం అమలు చేయలేదు

-. నిరుద్యోగ భృతి అని చెప్పి మోసం చేశారు

-. కేసీఅర్ చెప్పిన వాగ్దానాల పై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది

-. ఎన్నికలు దగ్గర పడ్డాయి

– ఈ లోపు ఇచ్చిన వాగ్ధానాలు అన్ని నిలబెట్టుకునే లా పోరాటం చేయాలి

-. తెలంగాణ లో మెగా సంస్థకు కేసీఅర్ అన్ని వనరులు దోచి పెడుతున్నారు

-. కేంద్రంలో అదానికి మోడీ అంతా దోచి పెడుతున్నారు

-. కనీస వేతనాలు కూడా అమలు చేయలేనీ పరిస్థితి

-. T – save కి పూర్తి మద్దతు

-.ప్రజా సమస్యల పై కలిసి పోరాటం చేయాలి

వలి
CPI నేత

-. పేపర్ లీకుల విషయంలో అర్థం కాని పరిస్థితి

-. నిరుద్యోగులను ఆందోళనలో నెట్టారు

-. Cpi తరుపున t – SAVE పోరాటానికి పూర్తి మద్దతు

రామకృష్ణయ్య
BC యునైటెడ్ ఫ్రంట్

-. కేసీఅర్ ను గద్దె దించాలి

-. కేటీఆర్ ఎప్పుడు ఉద్యమంలో పాల్గొనలేదు

-. తెలంగాణ లో నిజమైన ఉద్యమ కారులను తొక్కి వేశారు

-. కేటీఆర్ ను ముఖ్యమంత్రి నీ చేసేందుకు brs పెట్టారు

-. అద్దె ఇంట్లో ఉండే కేసీఅర్ కుటుంభం ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారు

-. YSR హయాంలో ఉన్న ప్రతి పథకం అమలు కావడం లేదు

-. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తుంగలో తొక్కారు,అరోగ్య అమలు కావడం లేదు

-. TSPSC నీ ప్రక్షాళన చేయాలి

-. Tspsc లో అన్ని పార్టీలతో కూడిన కమిటీ వేయాలి

-. CBI దర్యాప్తు చేస్తే వాళ్ళ బండారం బయట పడుతుంది అని భయం

-. మొత్తం తెరాసా వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారని బయట పడుతుంది అని భయం

-. ఉన్నత అధికారాలు మొత్తం brs వాళ్ళను తయారు చేసుకున్నారు అని భయం

-. కేసీఅర్ ను ప్రశ్నిస్తే కేసులు పెట్టాలని చూస్తున్నారు

-. YSR హయాంలో ఎస్సీ,ఎస్టీ,బిసి లకు న్యాయం జరిగింది

-. క్యాంపు ఆఫీస్ లో ప్రతి రోజూ ప్రజా దర్బార్ ఉండేది

-. ఇప్పుడు ప్రగతి భవన్ లో దోమలు తప్పా ఎవరు లేరు

శరత్ నాయక్
గిరిజన శక్తి

-. తెలంగాణ లో 33 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు

-. BRS నిరుద్యోగులను మోసం చేసింది

-. నిరుద్యోగుల జీవితాలను ఆగం చేశారు

-. రాష్ట్రంలో జరిగిన ప్రతి పరీక్ష లీకులు అయినట్లు అనుమానాలు

-. బోర్డ్ ను మొత్తం రద్దు చేయాలి

-. ఈ సర్కార్ లో నిరుద్యోగులకు న్యాయం జరగదు

-. TSPSC స్కాం లో విచారణ జరిపించాలి

-. ఈ స్కాం లో దాగివున్న పెద్దలను బయట పెట్టాలి

Leave A Reply

Your email address will not be published.

Breaking