మళ్లీ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతంగా ఉంటాడు.
కాంగ్రెస్ పార్టీపై ప్రజలు అసహనంగా ఉన్నారు.
7000 మెగావాట్ల నుంచి 26000 మెగావాట్లకు పెంచిన ఘనత కేసీఆర్ ది.
బిఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన పల్లి వినోద్ కుమార్.
హుజురాబాద్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 3
బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అని, ప్రజల సమస్యలపై పోరాడటం తప్ప పదవుల కోసం ఆరాటం లేదని, రాష్ట్ర ప్రణాళిక బోర్డు సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం హుజురాబాద్ లోని సాయి రూప గార్డెన్లో ఏర్పాటుచేసిన కృతజ్ఞత సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఒక కేసీఆర్ ఉద్యమాన్ని మొదలు పెట్టాడని దాని తర్వాత కోట్ల మంది ఆయన వెంట నడిచారని అన్నారు. రాజకీయంలో గెలుపు ఓటములు సహజమని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఓడిపోయినప్పటికీ కేసీఆర్ మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలకు నోచుకోని హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. గెలిచి రెండు నెలలు కాకముందే కాంగ్రెస్ పార్టీ విధానాలతో ప్రజలు విసిగిపోతున్నారని, ఆ పార్టీపై ప్రజలంతా అసహనంగా ఉన్నారని ఆయన అన్నారు. ఓటమి తర్వాత కెసిఆర్ ప్రణాళిక బద్ధంగా పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీని ఉద్యమ సమయంలోనే అనగదొక్కాలని చూసిన పార్టీలు తెలంగాణలో కనుమరుగయ్యాయని, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల నుంచి దూరం చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను తృణపాయంగా వదిలేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని, పార్లమెంట్ లో ఇద్దరం ఎంపీలం ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో 7778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మాణం చేసి పదేళ్ళలో 26000ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం జరిగిందని, దేశంలోనే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. గత ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు 20వేల మెజారిటీ ఇచ్చారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించాలని అన్నారు. ఈ సమావేశంలో హుజురాబాద్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, టూరిజం డెవలప్మెంట్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, జమ్మికుంట చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, నియోజకవర్గంలోని ఎంపీటీసీలు,జడ్పీటీసీలు,సర్పంచులు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఎవరు అధైర్య పడొద్దు మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
హుజురాబాద్ నియోజకవర్గం లో మెజారిటీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని ఎవరికి ఏ సమస్య వచ్చిన స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఎవరు అధైర్యపడవద్దని త్వరలోనే తిరిగి మన పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే ప్రభుత్వం నిలకడ పై పూర్తి విశ్వాసం లేదని ఆయన మాటల్లోనే అర్థమవుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలులో పూర్తిస్థాయిలో విఫలమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ సమిష్టిగా కృషి చేసి బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాలు గెలిచేలా కృషి చేయాలన్నారు.