ఫోర్ వేను పాత రోడ్డుపైనే నిర్మించాలి
ఫోర్ వే కోసం మా భూములు లాక్కొవద్దు
ప్రజలు బాధితుల ఆందోళన
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 03 : బడా వ్యాపారుల కోసం మా పేదోళ్ల లాక్కోవద్దని ఫోర్ వే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ప్రభుత్వాన్ని,అధికారులను కోరారు.శనివారం వారు పట్టణంలోని ఎల్లమ్మ గుడి ముందర ఆందోళన నిర్వహించారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ…ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం మా భూములు త్యాగం చేశామన్నారు. మిగిలిన ఎకరం,అర ఎకరాన్ని లాక్కొని మా పొట్టపై కొట్టొద్దని అధికారులను కోరారు.గతంలో చేసిన అలైన్ మెంట్ ప్రకారం నాలుగు వరసల రహదారి నిర్మించాలన్నారు.లేదా ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద తీసుకున్న భూములను రోడ్డు నిర్మాణానికి వేసుకోవాలన్నారు.కరకట్ట నిర్మించుకుంటే రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదని పేర్కొన్నారు.ప్రాణలైన అర్పించి తమ భూములను దక్కించుకుంటామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల భూముల జోలికి రావద్ధన్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం మా భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమన్నారు.ఈ కార్యక్రమంలో గోపి నర్సయ్య, రాపల్లి కృష్ణ,పెండం దేవయ్య, గుంపుల రామస్వామి,ఎంబడి రాజు,పడాల కాంతయ్య,రైతులు పాల్గొన్నారు.