జగిత్యాల, ఫిబ్రవరి 3:తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ హైద్రాబాద్ జగిత్యాల జిల్లా సమన్వయ కర్తగా చెట్ పెల్లి స్వప్న నియమితులయ్యారు. జగిత్యాల లోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో మైక్రో బయాలోజీ విభాగాదిపతిగా పనిచేస్తున్న స్వప్నను జగిత్యాల సమన్వయకర్తగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, జోనల్ కోఆర్డినేటర్ విఠల్ నియమిస్తూ శనివారం నియామక పత్రాన్ని అందించారు. చెట్ పెల్లి స్వప్న నియామకం పట్ల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.శ్రీలత, వివిధ విభాగాదిపతులు జ్యోతి, మశ్రత్ బుతోల్, సమతలతోపాటు కొక్కుల రాజేష్, సుధాకర్, మనోహర్, శశి, శ్రీరామ్, విజ్ఞాన్, శమంత్ అభినందించారు.