వ్యక్తిత్వ వికాసంలో మానసిక ఆరోగ్యానిదే ముఖ్య పాత్ర ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 03 : వ్యక్తిత్వ వికాసంలో మానసిక ఆరోగ్యానిదే ముఖ్య పాత్ర ఇవ్వాలని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర విభాగధిపతి డాక్టర్ పత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోదెల సహకారంతో హెల్త్ క్లబ్ ద్వారా విద్యార్థులకు మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించడం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా మాట్లాడుతూ… ముందస్తు ప్రణాళికతో ఎప్పటికప్పుడు చదువుకుంటే విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి ఉండదన్నారు.కేవలం పరీక్షలు సమీపిస్తున్న వేళ పుస్తకాలు చదవడం,సిలబస్ చూసి భయపడటం సహజంగా జరుగుతాయన్నారు.ప్రతి విద్యార్థి స్పష్టమైన ప్రణాళికతో చదువుపై శ్రద్ధ పెడితే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. అనంతరం జంతుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పత్తి చంద్ర శేఖర్ మాట్లాడుతూ…నిర్ధిష్ఠమైన లక్ష్యం, మంచి ఆహరం,కనీస వ్యాయామం లాంటివి మానసిక,శారీరక ఒత్తిడిని దూరం చేస్తాయన్నారు.ప్రభుత్వ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థిపై చదువుతో పాటు వారి వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు.జంతుశాస్త్ర విభాగంలో నిర్వహిస్తున్న రెడ్ రిబ్బన్, హెల్త్ క్లబ్,ఫీల్డ్ విజిటింగ్ వంటి కార్యక్రమాలు చదువుతో పాటు సమాజం పట్ల అవగాహనను విద్యార్థులకు కల్పిస్తాయన్నారు.ముఖ్యంగా మానసిక ఆరోగ్యంతోనే ఏదైనా సాధించవచ్చని ఈ సదస్సులో విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు.నేటి జీవన విధానంలో మొబైల్ ఫోన్,ఇతర సామాజిక మధ్యమాలకు వీలైనంత దూరంగా ఉంటే తక్కువ సమయంలోనే ఎక్కువగా చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.చదువును వ్యక్తిత్వ వికాసానికి పునాదిగా భావించాలని,భారంగా, అయిష్టంగా నేర్చుకోవద్దన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తరచుగా వారి పిల్లలతో కొంత సమయాన్ని చదువు విషయంలో కేటాయిస్తే మానసిక ఒత్తిడి దూరం అవుతుందన్నారు. పలువురు విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించడానికి అడిగిన ప్రశ్నలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోదెల హెల్త్ అసిస్టెంట్ ఇషాక్ సహకారంతో నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అరుణ,కుమార స్వామి, సతీష్,సంధ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking