సింగిరెడ్డి తిరుపతి రెడ్డి.
ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 3
భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ పిలుపు మేరకు ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో గావ్ చలో అభియాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు మాట్లాడుతూ పేదల సంక్షేమం, మహిళా సాధికారత, అంతర్గత, బాహ్య భద్రత, సాంస్కృతిక పునరుద్ధరణ, విదేశాల్లో భారతదేశ గౌరవాన్ని పెంచడం వంటి అనేక రంగాలలో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఊహకు కూడా అందని అసాధారణ అభివృద్ధి సాధించింది.అభివృద్ధి దార్శనికతను, కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టి యావత్ దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి.అందుకు జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డా మార్గదర్శకత్వంలో “గావ్ చలా అభియాన్” చేపట్టాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి,ఉప్పర రమేశ్,ఎండీ షఫీ ఖాన్, కంకణాల రవీందర్ రెడ్డి, అబ్బీడి తిరుపతి రెడ్డి,మడ్డి శ్రీనివాస్ ,మట్ట పవన్ రెడ్డి, నర్ర మధుకర్ రెడ్డి,జంగం సమ్మయ్య,చల్ల జగన్ రెడ్డి,ఒద్ది ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.