అసెంబ్లీ ఎన్నికల కోడ్ వలన 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, బల్దియా జనరల్ బాడీ మీటింగ్ పై చర్చ
ఎన్నికల కోడ్ రాకముందే బల్దియా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం చేయాలని వినతి
మేయర్ విజయలక్ష్మి తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని అంశాల పైన అనుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
వెంటనే జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ తో ఫోన్లో మాట్లాడిన సిఎం రేవంత్
పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న సీఎం ను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు అని స్పష్టం చేసిన మేయర్
జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, జనరల్ బాడీ మీటింగ్, జిహెచ్ఎంసి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి అంశాల పైన ప్రభుత్వం వెంటనే ప్రభుత్వపరమైన చర్యలు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి కోరారు. ప్రత్యేకంగా పురపాల శాఖ మంత్రి లేకపోవడం, ఆ శాఖకు బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో మరింత చొరవ చూపాలని ఆమె కోరారు. ఈరోజు ముఖ్యమంత్రి నివాసంలో మేయర్ రేవంత్ రెడ్డిని కలిశారు.
రాష్ట్రానికే అత్యంత కీలకమైన ఆర్థిక ఇంజన్ హైదరాబాద్ నగరం పరిపాలనకు ఎన్నికల కోడ్ వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గత ఐదు నెలలుగా స్టాండింగ్ కమిటీ ఏర్పాటు పెండింగ్లో ఉందని, నవంబర్లో అమలులోకి వచ్చిన ఎన్నికల నియమావళి ఇందుకు అడ్డంకిగా మారిందన్నారు. దీంతోపాటు ఆగస్టులో జరగవలసిన జిహెచ్ఎంసి జనరల్ బాడీ సమావేశం కూడా ఇంకా పెండింగ్లో ఉంది అన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్రాస్ కి పలుసార్లు ఆదేశాలు జారీ చేశామని, అయితే ఈ అంశంలో ప్రభుత్వ సూచనల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు అన్నారు.