రాష్ట్ర ప్రభుత్వం గోవును రాష్ట్రీయ గోమాతగా ప్రకటించాలి:ఎన్‌. ఆర్‌.లక్ష్మణ్‌

రాష్ట్ర ప్రభుత్వం గోవును రాష్ట్రీయ గోమాతగా ప్రకటించాలని తెలంగాణ భజరంగ్‌ సేనా కోటి సంతకాల సేకరణను చేపట్టింది.హైద్రాబాద్‌,కోఠి, ఆంధ్రాబ్యాంక్‌ చౌరస్తాలో తెలంగాణ భజరంగ్‌ సేనా ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు ఎన్‌ ఆర్‌.లక్ష్మణ్‌, గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి,గోమాతను రాష్ట్ర గోమాతగా ప్రకటించాలని కోటి సంతకాల సేకరణ చేపట్టి ఇటు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కి,భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి పంపియనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర భజరంగ్‌ సేనా అధ్యక్షుడు ఎన్‌ ఆర్‌.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో గౌవులు అనేకం కబేళాలకు తరయించి గోవుల సంతతిని హరించావేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గోవులు పర్యావరణం పరిరక్షణకు, మానవాళి జీవిత ఆరోగ్యశైలికి ఎంతో దోహదం చేస్తాయి అని,గోవుల పేడ,గోమూత్రం అనేక రోగాలకు వైద్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. గోవుల వల్ల ఎలాంటి నష్ట్రం లేదుకాని అనేక లాభాలు ఉన్నాయి కాబట్టి గోవును రాష్ట్ర గోమాతగా ప్రకటించాల్సి న అవసరం ఎంతో ఉందని ప్రజలలో చైతన్యం తీసుకురావాలని కోటి సంతకాల సేకరణ చేపట్టామని చెప్పారు. తమ కోటి సంతకాల సేకరణ పూర్తి అవ్వగానే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి,భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంపియనున్నట్లు లక్ష్మణ్‌ తెలియజేశారు.అవును రాష్ట గోమాతగా ప్రకటించేవరకి తమ ఉద్యమాన్ని కొనసాగిస్తూ.. తమ డిమాండ్లను నెరవేర్చే వారికి తమ ఉద్యమం ఉదృతం చేస్తామని ఎన్‌. ఆర్‌.లక్ష్మణ్‌ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking