మెదక్ టౌన్ 03/02/24 ప్రాజబలం న్యూస్:-
తెలంగాణ సోషల్ టీచర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో వివిధ మండలాల్లో నిర్వహించిన ప్రతిభాపాటవ పరీక్షలో సత్తా చాటిన 10వ తరగతి విద్యార్థులకు నేడు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల లో ప్రతిభాపాటవ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ మాట్లాడుతూ అన్ని పోటీ పరీక్షలకు సాంఘిక శాస్త్రం తప్పనిసరి అని, ఈ సబ్జెక్ట్ ద్వారానే విద్యార్థులలో జాతీయ బావాలు,నైతిక విలువలు పెంపందుతాయని, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత సోషల్ ఉపాధ్యాయులదని వారు అన్నారు.తెలుగు మీడియం నుండి 63 మంది, ఇంగ్లీష్ మీడియం నుండి 70 మంది హాజరయ్యారు. ప్రతిభాపాటా పరీక్షలొ ప్రభుత్వ పాఠశాలల తెలుగు మీడియం నుండి
ప్రథమ విష్ణు వర్ధిన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మనోహర బాద్.
ద్వితీయ అనుష్క, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర. రామాయంపేట
తృతీయ సుధీష్ణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నస్కల్.
స్థానాలు పొందారు
ప్రభుత్వ పాఠశాలల ఇంగ్లీష్ మీడియం నుండి
ప్రథమ సుమంత్ ఎమ్ జె పి బాలుర, హవెలి ఘనపూర్.
ద్వితీయ వినయ శ్రీ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల. తృతీయసృజన్ ఎమ్ జె పి బాలుర హవెలి ఘనపూర్
విద్యార్థులు స్థానాలను పొందారు
అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం నుండి ప్రథమ సాయి చరణ్, శంకర స్కూల్, నిజాం పెట్
ద్వితీయ శ్రీ ప్రియా గీతా చేగుంట. తృతీయ సోహాన్ దీప్ సింగ్, సత్యం విద్యా మందిర్.
స్థానాలలో సాధించిన విద్యార్థులకు జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధా కిషన్ , అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుదర్శన్ మూర్తి , రమేష్ బాబు , జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి , మండల విద్యాధికారి నీలకంఠం , స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేఖ గారు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా సోషల్ ఫోరం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిరునగిరి నర్సింలు, ఎస్ ప్రభాకర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ,సోషల్ ఫోరమ్ సభ్యులు చల్లా లక్ష్మణ్,దాతద్రి కుల కర్ణి,సత్యనారాయణ, దేవి సింగ్, రవి బాబు, వీరేశం, సిద్ధిరములు తదితరులు పాల్గొన్నారు.
