వైఎస్సార్ టిపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ
జగిత్యాల, ఆగస్టు 22: బీఆర్ ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో బిసిలకు అన్యాయం జరిగిందని, బీసీలను విస్మరించిందని వైఎస్సార్ టిపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చెదల సత్యనారాయణ అన్నారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో జనాభాలో 60 శాతం ఉన్న బిసిలకు లెక్కప్రకారంగా అధిక ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలన్నారు. కానీ కొన్నిచోట్ల బిసిలకు సీట్లు కేటాయించి అన్యాయం చేశారన్నారు. జగిత్యాల జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో ధర్మపురి ఎస్సి రిజర్వేషన్ల లో పోగా మిగిలిన రెండు అసెంబ్లీ స్థానాల్లో వెలమ సామాజిక వర్గానికి కేటాయించడం అన్యాయమన్నారు. బిసిలకు జరుగుతున్న అన్యాయంపై బిసిలందరు సంఘటితమై అన్యాయాన్ని ఎదురించాలని చెదల సత్యనారాయణ కోరారు.