అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 22 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా స్థానిక జెడ్పి సెంటర్ చర్చ్ కాంపౌండ్, ప్రకాష్ నగర్ లలోని చౌక ధరల దుకాణాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాలలో నిర్వహించే స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ తెలిపే బోర్డులు, బయోమెట్రిక్ ఈ-పాస్ యంత్రాలను పరిశీలించారు. సమయ పాలన పాటించాలని, ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఖచ్చితంగా దుకాణాలు తెరిచి వుంచాలని ఆయన తెలిపారు. ప్రతి షాపులో ఆర్డీవో చే జారీచేసిన ఆథరైజేషన్ సర్టిఫికెట్ ప్రదర్శించా లన్నారు. మూసివున్న ఆథరైజేషన్ సర్టిఫికెట్ ప్రదర్శించని దుకాణాలకు షోకాజ్ నోటీసు జారిచేసినట్లు ఆయన తెలిపారు ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు చేపట్టనున్నట్లు అదనపు కలెక్టర్ అన్నారు
ఈ సందర్భంగా పౌరసరఫరాల డిటి సురేందర్ అధికారులు తదితరులు ఉన్నారు.