అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 22 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ నూతన కలెక్టరేట్ లోని కలెక్టరేట్ సిబ్బంది, రికార్డ్ రూమ్ భూసేకరణ విభాగం దేవాదాయ ఖజానా వ్యవసాయ శాఖల కార్యాలయాల ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ సందర్భంగా కార్యాలయాలను పరిశీలించి, సిబ్బంది హాజరును పరిశీలించారు. విధులకు గైర్హాజరైతే ముందస్తు అనుమతి పొందాలని, ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ అన్నారు.