ఉమ్మడి మెదక్ సెప్టెంబర్ 13 ప్రజ బలం బ్యూరో : జర్నలిస్టుల దినవోత్సవం పురస్కరించుకొని చేర్యాల పట్టణానికి చెందిన జర్నలిస్టు లు కర్రోల్ల నవజీవన్ మరియు కర్రోల్ల ఆన్నమ్మ ని చేర్యాల మండల బి.ఆర్.ఎస్. యువ నాయకులు బంగారీగల్ల కిరణ్ మరియు గోనేపల్లి మహేష్ లు శాలువాతో సత్కరించి సన్మానం చేశారు.ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టు ల పాత్ర అద్భుతం అని తెలిపారు.అదే విధంగా సమాజంలో జర్నలిస్టు లు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు.నేరాల నియంత్రణ లో, సమాచార చెరవేతలో, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిస్టు ల పాత్ర వెలకట్టలేనిది అని కిరణ్ తెలిపారు.ఈ సందర్భంగా జర్నలిస్టు లు అయిన నవజీవన్ అన్నమ్మ లు కిరణ్ మహేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.