సమర్థవంతంగా
అమలు చేయడం వ్యాధుల నిర్మూలనకు
మూల కారణం
వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను అంచనా వేయాలని తాసిల్దార్ కు ఆదేశించిన కలెక్టర్
అంగన్వాడి సెంటర్ ను పరిశీలించి పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం సమపాలలో అందాలి
విస్తృతంగా పర్యటించి. ఫ్రైడే- డ్రైడే , అంగన్వాడి సెంటర్, వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన
కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాబలం – మెదక్ నియోజకవర్గం
13.09.2024:
శుక్రవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అక్కన్నపేట గ్రామంలో ఫ్రైడే- డ్రైడే కార్యక్రమాన్ని, అంగన్వాడి సెంటర్, వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను జిల్లా పాలనాధికారి పరిశీలించారు.
ఫ్రైడే- డ్రైడే సందర్భంగా మండలంలో కలెక్టర్ తనిఖీలు చేపట్టారు. తొలుత మండల అక్కన్నపేట గ్రామంలో పర్యటిస్తూ అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఓ వీధిలో తాగి పడేసిన ఖాళీ కొబ్బరిబోండాలను పరిశీలించి అనంతరం పలువురు ఇళ్లకు వెళ్లి నీటి తొటి తొట్టిలను పరిశీలించారు. నిల్వ నీటిని తీసేయాలని సూచించారు. గ్రామంలో పారిశుధ్య పనితీరును పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు ప్రతి శుక్రవారం మండలాల్లో, గ్రామ పంచాయతీల్లో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు.
మురుగు కాల్వల శుభ్రత, కాల్వల చెత్తను ట్రాక్టర్ ద్వారా తొలగించుట, రోడ్ల మీద పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించుట, ఇంటి పరిసరాల్లో పిచ్చి మొక్కలను తొలగించుట, గ్రామాల్లోని ఇళ్లకు వెళ్లి నీటి తొట్టెలలోని నీటి నిల్వలను శుభ్ర పరచుట, ఆశాలతో ఇంటి సభ్యులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించుట, నీటి ట్యాంకులను శుభ్ర పరిచి వాటిలో ఆయిల్ బాల్స్ వేయించుట, నీటి ట్యాంకుల ట్యాపుల వద్ద పేరుకుపోయిన నాచును శుభ్ర పరచుట, ఊర్లలో ఫాగింగ్, బ్లీచింగ్ చేయించుట, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్, తదితర విష జ్వరాలు ప్రబలకుండా నిరంతరం జాగ్రత్తగా ఉండేలా ఇళ్లను, ఇంటి పరిసరాలను శుభ్ర పరచుట, తడి, పొడి చెత్తను వేర్వేరుగా చెత్త వాహనాల్లో వేయుట, వంటి పనులను చేపట్టారన్నారు.

అనంతరం వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించి పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని తాసిల్దార్ కి సూచించారు.
అంగన్వాడి సెంటర్ ను పరిశీలించి పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల పైన ప్రత్యేక శ్రద్ద వహించాలని అంగన్వాడీ సెంటర్లో టీచర్లు పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల్ని గుర్తించి, ప్రతి 15 రోజులకోసారి సరైన పద్ధతిలో బరువులు, ఎత్తు కొలతలను తీసి ఆన్లైన్లో సరైన విధంగా నమోదు చేయాలని, ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, హెల్త్ సూపర్వైజర్ ల పర్యవేక్షణలో తల్లిదండ్రులకు చిన్నారుల స్థితిని తెలియజేయాలన్నారు.అంగన్వాడీ సూపర్వైజర్ ప్రతి సెక్టార్ సమావేశంలో పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలపై ఆరా తీయాలని, వారి స్థితి వివరాల నివేదికను అందజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రామాయంపేట తాసిల్దార్
రజిని సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు