తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

 

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజా బలం – మెదక్ జిల్లా ప్రతినిధి
13.09.2024:

ఈ నెల 17 వ తేదీన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్బంగా.. అందుకు ఏర్పాట్లను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 17వ తేదీన మన జిల్లా లో జరిగే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కే .కేశవరావు, (అడ్వైజర్ టు గవర్నమెంట్) రానున్నట్లు తెలిపారు.
ఆ రోజున అన్ని పాఠశాలల్లో, కార్యాలయాల్లో ఉదయం 9:30 గంటల వరకు జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు.
అలాగే సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఉదయం పది గంటలకు ముఖ్య అతిధి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం , ముఖ్యఅతిథి సందేశం, పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల
ప్రదర్శనలు కార్యక్రమాలు ఉంటాయని అందుకు గాను మినట్ టూ మినట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ తయారు చేసుకొని
తగిన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking