ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఫ్రెషర్స్ డే

 

ప్రభుత్వ జూనియర్ కళాశాల రామాయంపేట

ప్రజాబలం – మెదక్ నియోజకవర్గం
13.09.2024:

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల రామాయంపేట లో ఈరోజు ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఫ్రెషర్స్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ నోడల్ ఆఫీసర్ మాధవి మరియు రామయంపేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్, సబ్ ఇన్స్పెక్టర్ బాలరాజు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలను నెరవేర్చాలని సమాజానికి ఉపయోగపడే భావి భారత పౌరులుగా తయారు కావాలని చెప్పారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్ మాట్లాడుతూ తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేటటువంటి చెడు అలవాట్లకు లోను కాకూడదు, ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడతారు అని చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదవాలి మంచి స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ హేమజ్యోతి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ఇన్చార్జ్ బాలా గౌడ్, మల్లేశం శ్రీనివాసాచారి,బాబురావు, ఆంజనేయులు ,సురేందర్ రెడ్డి బాల ప్రకాష్ ,శ్రీనివాస్, అశోక్ గౌడ్, నరసింహులు గౌడ్, శ్రీదేవి, సురేష్ గౌడ్, శ్రీశైలం ,మస్తాన్వలి ,యాదగిరి, మంగ మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యార్థిని విద్యార్థులందరికీ అన్న ప్రసాద వితరణ చేసినటువంటి వారు అంసాన్పల్లి కన్నోజు గారి వరలక్ష్మి బ్రహ్మయ్య చారి చారిటబుల్ ట్రస్ట్ రామాయంపేట వీరికి కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు అందరూ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.

Breaking