సూర్య నాయక్ మృతదేహం దుబాయ్ నుండి స్వగ్రామానికి చేరుకుంది

 

సహకరించిన ప్రజా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు

ప్రజాబలం – మెదక్ నియోజకవర్గం
13.09.2024:

గత 15 రోజుల నుంచి ఎదురుచూస్తున్న రాట్ల సూర్య నాయక్ మృతదేహం దుబాయ్ నుండి నేడు మృతుని స్వగ్రామానికి చేరుకుంది మృతదేహం దుబాయ్ నుంచి మృతుని గ్రామానికి చేరడానికి విశేష ప్రయత్నం చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావుకి గడ్డం శ్రీనివాస్ కి రాజ శ్రీనివాసరావు కి మురళీధర్ రెడ్డి కి మృతుని కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది రాట్ల సూర్య అబుదాబిలో మరణించాడని వార్త తెలిసిన వెంటనే గ్రామస్తులు కుటుంబ సభ్యులు మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారిని ఆశ్రయించడం జరిగింది మెదక్ ఎంపీ రఘునందన్ రావు వెంటనే స్పందించి భారత ప్రభుత్వ ఎంబసీ మరియు అబుదాబిలో ఒక అడ్వకేట్ ను మరియు రాజా శ్రీనివాసరావు టీం తో మాట్లాడి మృతదేహాన్ని మృతుని స్వగరావమైన తిమ్మక్కపల్లి గ్రామానికి తీసుకురావాలని సూచించిన వెంటనే రాజా శ్రీనివాసరావు గారి బృందం గల్ఫ్ జేఏసీ ఉపాధ్యక్షులు మురళీధర్ రెడ్డి వెంటనే స్పందించి మృతదేహాన్ని ఉచితంగా తెప్పించడానికికృషి చేశారు ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఐదు గంటలకు రావడం జరిగింది అక్కడ నుండి మృతుని ఇంటికి అంబులెన్స్ ద్వారా పంపడం జరిగింది మృతదేహాన్ని తెప్పించడంలో సహకరించిన అధికారులకు రాజా శ్రీనివాస బృందానికి ఎంపీ రఘునందన్ రావు కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది
మృతుని గ్రామానికి మృతదేహం రాగానే అంత్యక్రియలు జరిగాయి ఇట్టి అంత్యక్రియలలో బిజెపి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పాల్గున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking