ఆయిల్ ఫామ్ రైతులకు రక్షణ,
ఆర్థిక సామాజిక వృద్ధి సాధించాలంటే ఏకైక మార్గం ఆయిల్ ఫామ్ సాగు
తక్కువ పెట్టుబడి తక్కువ శ్రమతో కూడిన పంట ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు కలెక్టర్
మెదక్ జిల్లా ఆయిల్ ఫామ్ తోటల సాగుకు అనుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్రవేత్తల ధ్రువీకరణ
2024-25 సంవత్సరమునకు గాను మెదక్ జిల్లాలో 02 వేల ఎకరాల ఆయిల్ ఫామ్ సాగుకు ప్రణాళికలు సిద్ధం
మెదక్ పట్టణంలో గల నస్కేట్ ఏరియాలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ క్రింద మొక్కలు నాటిన కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాబలం – మెదక్ జిల్లా నియోజకవర్గం
13.09.2024:
ఆయిల్ ఫామ్ సాగులో మెదక్ జిల్లా
అగ్రస్థానంలో నిలవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మెదక్ పట్టణంలో గల నస్కెట్ ఏరియాలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ఆయిల్ ఫామ్ తోటలకు అనుకూలంగా ఉందని ఆయిల్ ఫామ్ పరిశోధనా సంస్థ పెదవేరి మండలం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్రవేత్తలు జిల్లాను సందర్శించి ధ్రువీకరణ జరిగిందని తెలిపారు.
2024-25 సంవత్సరానికి మెదక్7 జిల్లాలో ( 2 ) వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటలు సాగుకు ప్రణాళికలు చేసుకోవడం జరిగిందని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు
1176 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని
ఇప్పటివరకు 25 ఎకరాల ఆయిల్ ఫామ్ తోటలు పెట్టడం జరిగిందని చెప్పారు.
2023 -24 సంవత్సరం మెదక్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు నిమిత్తం రైతులకు మొక్కలు సరఫరా చేయుటకు మరియు దిగుబడిని కొనుగోలు చేసి నూనె ఉత్పత్తి చేయుటకు ఈ జిల్లాలో ఫ్యాక్టరీ నిర్మించుటకు లివింగ్ ఫుడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవో ఎంఎస్ నెంబర్ 25 ద్వారా జారీ చేయడం జరిగిందన్నారు.
లివింగ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు మొక్కలు ఉత్పత్తి చేయుటకు చెల్మెడ గ్రామం నిజాంపేట మండలంలో 43 ఎకరాల స్థలంలో నర్సరీని స్థాపించడం జరిగిందని తెలిపారు.
మెదక్ జిల్లాలో 2023- 24 సంవత్సరంలో
74 మంది రైతులు 336 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చెప్పడం జరిగిందని వివరించారు.
ప్రభుత్వం ద్వారా 336 ఎకరాలకు సంబంధించి 13 లక్షల రూపాయల సబ్సిడీని రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పారు.
ఒక రైతు గరిష్టంగా 12. 50 ఎకరాల వరకు డ్రిప్ పరికరాలపై 90 % రాయితీ సదుపాయం కల్పించబడునని చెప్పారు.
ఒక ఎకరానికి ఆయిల్ ఫామ్ మొక్కలకు 9,650 మొదటి సంవత్సరం సబ్సిడీ ఇవ్వడంతో పాటు, అంతర్ పంటల సాగు కొరకు మొదటి ,రెండవ, మూడవ, నాలుగవ సంవత్సరాలకు గాను 26,450-00 సబ్సిడీ అందించడం జరుగుతుందన్నారు.

ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన నాలుగో సంవత్సరం తర్వాత నిరంతర దిగుబడి వస్తు 10 నుంచి 12 టన్నులు దిగుబడి సాధించవచ్చునన్నారు.
ప్రస్తుతము ఒక టన్ను ఆయిల్ ఫామ్ గెల 14,500 ఈ లెక్కన సంవత్సరానికి (01) లక్ష 74 వేల ఆదాయం వచ్చునని అన్ని ఖర్చులు పోను సంవత్సరమునకు ఒక ఎకరానికి 01 లక్ష 20 వేల ఆదాయం సమకూరునని పేర్కొన్నారు.
రైతులు తమ ఆయిల్ ఫామ్ ఉత్పత్తులను ఫ్యాక్టరీ వరకు రవాణా చేసుకొనుటకు అధిక చార్జీలు కేటాయించవలసి రావడం వలన కంపెనీ వారు రైతులకు ఇబ్బందికలగకుండా ప్రతి 20 కిలోమీటర్లకు ఒక సేకరణ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
కంపెనీ వారు గెలలను కొనుగోలు చేసిన తర్వాత నియమ నిబంధన ప్రకారం 14 రోజుల్లోపు రైతు ఖాతాలకు డబ్బులుజమ చేయబడుతుందని చెప్పారు
మెదక్ జిల్లాలోని రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన పెంచుకొని అధిక విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టి ఇతర పంటల కంటే అధిక దిగుబడులు మరియు లాభం పొందాలని ఆకాంక్షించారు.
ఇతర వివరాల కోసం ఉద్యానవనాధికారి మెదక్ (8977714423), ఉద్యానవన అధికారి నర్సాపూర్(8977714422) సంప్రదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన మరియు పట్టి పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్ ,ఉద్యానవన అధికారులు రచన ,సంతోష్ కుమార్ మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ
విస్తరణ అధికారి రాజశేఖర్, లివింగ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ కృష్ణ, జిల్లా ఆయిల్ ఫామ్ విస్తరణాధికారులు, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు