మృత్యుని కుటుంబానికి న్యాయం చేసేదాకా కదిలేది లేదంటూ పోలీసులతో వాగ్వాదం
ప్రజాబలం -మెదక్, రామయంపేట మండలం
13.09.2024:
పురుగుల మందు తాగి హత్మహాత్య చేసుకున్న గ్రామ బీ ఆర్ఎస్ అధ్యక్షులు రైతు పున్న స్వామి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులురాస్తారోకో చేశారు.మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గం పరిధిలోని రామాయపేట మండలం సూతర్పల్లి గ్రామానికి చెందిన పున్న స్వామి అనే టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మరియు రైతు తన భూమి వివాదంలో కొందరు బెదిరింపులకు పాల్పడడంతో మనస్తాపం చెందిన పున్న స్వామి గత నాలుగు రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీస్తూ బెదిరింపులకు పాల్పడిన వారి వివరాలు తెలియజేస్తూ పురుగుల మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు అయితే బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు దీంతో బంధువులు సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి గారు బెదిరింపులకు పాల్పడిన వారిని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు
