బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హౌస్ అరెస్ట్

ప్రజాబలం – మెదక్ జిల్లా నియోజకవర్గం
13.09.2024:

మెదక్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ని శుక్రవారం ఉదయం కొంపల్లి లో గల ఇంటి వద్దనే హౌస్ అరెస్టు చేశారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో ఈరోజు అరికెపూడి గాంధీ ఇంటికి ఇది వెళ్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఈ సందర్భంగా పార్టీల మధ్య ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేస్తున్నారు ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ
బి ఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉద్యమాలు, ముందస్తు అరెస్టులు, జైలు కొత్త కాదని, పోలీసులను పెట్టి మమల్ని అణిచి వెయ్యాలని చూస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking