బి.అర్.ఎస్ రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ బిజెపి లో చేరిక

 

మనోహరబాద్ మండల టి.అర్.ఎస్ ఎంపిటిసి లావణ్య బిజెపి లో చేరిక
తూప్రాన్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం రవీందర్ బిజేపి లో చేరిక.

సీఎం సొంత ఇలాకా గజ్వేల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

తూప్రాన్, నవంబర్,3 ప్రజా బలం న్యూస్:-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గంలోని మనోహరాబాద్ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అయిన కాళ్లకల్ సర్పంచ్, రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్, తో పాటు టి. అర్ ఎస్ ఎంపీటీసీ ఎన్. లావణ్య మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేష్ గుప్త, యుత్ కాంగ్రెస్ నాయకులు కుమ్మరి నాగరాజ్, తూప్రాన్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ నాయకులు గడ్డం రవి, తో పాటు పలువురు వర్గంటి
రామ్మోహన్ గౌడ్ అధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ సమక్షంలో శుక్రవారం ఉదయం బిజెపి పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి గజ్వేల్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ బిజెపి ఖండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్, మెదక్ జిల్లా దళిత మోర్చ అధ్యక్షులు సంఖ్య యాదగిరి, బిజెవైయం జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు జానకి రాము గౌడ్ , శ్రీకాంత్ పటేల్ , గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మనోహరాబాద్ మండలం బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking