ప‌ని చేసే వారికి ప‌ట్టం క‌ట్టండి

అభివృద్ధిని చూసి ఆశీర్వ‌దించండి
బీఆర్ఎస్ కు అండ‌గా నిల‌వండి
కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి

బీజేపీకి ఓటేస్తే అగ‌మ‌తాం

ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
ప్ర‌చారంలో దూసుకెళ్తున్న అల్లోల‌
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. జ‌రిగిన అభివృద్ధి, సంక్షేమం, బీఆర్ఎస్ మ్యానిపెస్టోను వివ‌రిస్తూ..ఇంటింటి ప్రచారం, రోడ్ షో

ప‌ని చేసే వారికి ప‌ట్ట క‌ట్టండి. నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అభివృద్ధిని చూసి మ‌రోసారి అవ‌కాశ‌మిస్తే.నిర్మ‌ల్ ను మ‌రింత ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతా. విద్యుత్, వ్య‌వ‌సాయం, వైద్య‌, విద్య రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించాం. ప్ర‌తి కుటుంబం ఎదో రూపంలో ప్ర‌భుత్వ సాయం పొందుతున్నాయి. మీరంతా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాల‌ని బీఆర్ఎస్ నిర్మ‌ల్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి, మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.
శుక్ర‌వారం నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని నిర్మ‌ల్ రూర‌ల్ మండ‌లం కౌట్ల (కే), ముజ్గి, తాంసి, చిట్యాల గ్రామాల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ప్ర‌ధాన జంక్ష‌న్లలో రోడ్ షోలు నిర్వ‌హిస్తూ. కాల‌నీల్లో గ‌డ‌ప గ‌డ‌ప‌కు వెళ్తూ.జ‌రిగిన అభివృద్ధి, సంక్షేమం, బీఆర్ఎస్ మ్యానిపెస్టోను వివ‌రిస్తూ..కారు గుర్తుకు ఓటేసి మ‌రోసారి ఆశీర్వ‌దించాల‌ని అభ్య‌ర్థించారు.
మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి అడుగ‌డుగునా ఆపూర్వ ఆద‌ర‌ణ ల‌భించింది. మ‌హిళ‌లు మంగ‌ళ‌హార‌తుల‌తో స్వాగ‌తం ప‌లికారు.
అనంత‌రం ప‌లు స‌భ‌ల్లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాక ముందు మ‌న బతుకులు ఎట్ల ఉండే.తెలంగాణ రాక‌పోతే మ‌న బ‌తుకులు ఆగ‌మైపోతుండే… కోట్లాడి సాధించుకున్న తెలంగాణ‌లో సీయం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ..దేశంలోనే రాష్ట్రాన్ని ఆద‌ర్శంగా తీర్చిదిద్దారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాల‌న ఎట్ల ఉందో.తెలంగాణ లో ఎట్ల ఉందో ప్ర‌జ‌లు ఆలోచించాలి. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం తెలంగాణ అభివృద్ధికి ఒక్క పైసా అయిన ఖ‌ర్చు చేసిందా అని ప్ర‌జ‌లు ఆలోచించాలి.బీజేపీ అభివృద్ధిని గాలికి వ‌దిలేసి కులం, మ‌తం ఆధారంగా ఓట్లు దండుకునే పయత్నాలు చేస్తుంది.
స్వ‌రాష్ట్రంలో ఊరు, వాడ‌లా ఎంతో అభివృద్ధి జ‌రిగింది. రోడ్లు వేసినం, సీసీ రోడ్లు నిర్మించినం. వాగులపై వంత‌న‌లు నిర్మించ‌డంతో ప్ర‌జ‌ల‌కు దూర‌బారం త‌గ్గింది. ఇట్లా ఎన్నో సౌల‌త్ లు క‌ల్పించుకున్నామ‌ని వివ‌రించారు. ఈ అభివృద్ధి ఇలాగే కొన‌సాగాలంటే… సంక్షేమ ప‌థ‌కాలు ఇంటింటికీ అందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాల‌ని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking