మన గజ్వేల్ నియోజక వర్గం అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం. జడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్.

 

ప్రతి ఇంట్లో కేసీఆర్ సంక్షేమ పథకాలను అందింది.

మరింత ప్రగతి కోసం గజ్వేల్ ఎమ్మెల్యే గా సిఎం కేసీఆర్ ను భారీ మెజార్టీ తో గెలిపించుకుందాం

మంచి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మళ్ళీ గేలువాలి
ఇస్లాంపూర్ ఊర్లో
గల్లీ గల్లీలో బిఆర్ఎస్ ప్రచార ప్రభంజనం.

సర్పంచ్ సుకన్య రమేష్, పిఎసిఎస్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి.

మెదక్ తూప్రాన్
నవంబర్ 17 ప్రాజబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ ఇస్లాంపూర్, వెంకటరత్న పూర్ గ్రామంలో సర్పంచ్ సుకన్య రమేష్, వెంకట్రాంరెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి అధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి
కేసీఆర్ కు మద్దతుగా ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి సౌజన్యంతో కారు గుర్తుకు ఓటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంటింటి ప్రచారము జోరుగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా జడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్, పిఎసిఎస్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి, నాయకులు రమేష్, మండల ఇన్చార్జి విద్యాసాగర్ మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే మరోసారి అధికార పార్టీ బిఆర్ఎస్ ను గెలిపిస్తాయన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజలు ఎంతో ఆకర్షితమై ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు. కెసిఆర్ కు తప్ప ఎవరికి మద్దతు తెలుపమని ప్రజల్లో నుండి అన్యుహ స్పందన లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కిరాణం షాప్, చాయ్ బండ్ల , పండ్ల బండిల వద్ద కూరగాయల కొట్టుల వద్ద ఇంటింటికి బిఆర్ఎస్ నాయకులు కరపత్రాలను చూపిస్తూ మరొకసారీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గెలిపించాలని
వేడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో మరో అడుగు ముందుకు వేయాలంటే బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని సందర్భంగా వారు తెలిపారు. అనంతరం మీడియాతో పి సి ఎస్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి, జెడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్, విద్యాసాగర్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చి అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన ఘనుడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని , గజ్వేల్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని, మేము ప్రచారం చేస్తూ ఉంటే ప్రజల ఆదరణ చూస్తుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ మా దేవుడని, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మాకు మంచి చేస్తున్నారని ప్రజలు చెప్పుతుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్ భారీ మెజార్టీతో గెలుపొంది ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్, భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షులు బోల్లంపల్లి బబుల్ రెడ్డి, కార్యనిర్వాక అధ్యక్షులు బగ్వాన్ రెడ్డి, నాయకులు వెంకటేష్ యాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking