మాజీ మంత్రి వర్యులు ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ అబ్సర్వర్ మహ్మద్ ఆరీఫ్ నసీం ఖాన్
ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ జావిద్
ఖమ్మం ప్రతినిధి నవంబర్ 17 (ప్రజాబలం) ఖమ్మం మహారాష్ట్ర మాజీ మంత్రి వర్యులు ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ అబ్సర్వర్ మహ్మద్ ఆరీఫ్ నసీం ఖాన్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలతో అంకెల గారడీలతో తెలంగాణ లోని అన్ని వర్గాల ప్రజలన ను కెసిఆర్ మోసం చేశారని ప్రజారంజ కపాలన అందించక పోగా మైనారిటీల ను ఎస్సీలను లను బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు.తెలంగాణ లోని వక్ఫ్ భూములు మొత్తం 77000 ఎకరాలుంటే వాటిలోని 55000 ఎకరాలు సేకరించి వాటికి లెక్కా పత్రం లేకుండా మాయ చేశారని అదే భూమల ద్వారా ముస్లిం అభ్యున్నతికి పాటు పడకుండా కబ్జా లు చేసి పంచుకొన్నారని అన్నారు అదేవిధంగా నిరుద్యోగులను నాయవంచనకు గురిచేసి ఆత్మ హత్యలకు గురిచేసినారని అన్నారు కేంద్రం లో బిజెపి రాష్ట్రంలో బిఆర్ఎస్ లు కలిసి మోసం చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉన్నదని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో చేసి చూపిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గారంటీలతో ప్రజలకు నమ్మకం కుదిరిందని 30 వ తారీఖున జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నా రని ధీమా వ్యక్తం చేశారు అనంతరం మహ్మద్ జావేద్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని అమలు చేయక పోగా ఆనాడు రాజశేఖరెడ్డి ఇచ్చిన రిజర్వేషన్ ని కుదించి వేశారని అలాగే గొప్ప మాటలు చెప్పే బిఆర్ఎస్ నాయకులు మైనారిటీ లకు ఇచ్చిన వాగ్దానాలను మరిచి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి మైనారిటీ కమిషన్ వేస్తామని మాయ మాటలతో వస్తున్నారని, మెదక్ ఖదీర్ లాకప్ లో వేసి కొట్టడం వల్ల అతను చనిపోయినారని అదే మైనారిటీ కమీషన్ ఉంటే ఆకుటుంబానికి న్యాయ జరిగేదని బిఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీ లు 5O లక్షలమంది మైనారిటీ లు ఉంటే మైనారిటీ లకు ప్రతి సంవత్సరం 2000 కోట్లు కేటాయించి 700 కోట్లు విద్యకు ఖర్చు చూపించడం దురదృష్ట కరమని అన్నారు. గతంలో 1993 లో కాంగ్రెస్ పార్టి మైనారిటీ కమిషన్ నియమించిందని ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దళితబందు పథకానికి వాడి ఎస్సీ లను మైనారిటీలను నిలువునా మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీకి 30 తారీఖు న జరిగే ఎన్నికలలో ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు హస్తం గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కొరారు. అనంతరం ఖమ్మం డిప్యూటీ మేయర్ జోహర ముక్తార్ మాట్లాడుతూ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారని జోహర స్తానికురా లు కాదని బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపిస్తున్నారు నా స్థానికత ఎంటో నిరూపిస్తా నీకు దమ్ముంటే నా డివిజన్ రా నేనేంటో చూపిస్తా అని సవాల్ చేస్తూ నాగరాజు నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించారు మేము నీతి నిజాయితీ చేసే రాజకీయాలే చేస్తాము నీచ నికృష్ట రాజకీయాలు చేసేది మీరు కమిషన్ల కు కక్కుర్తి పడేది మీరుఇకనైనా అసత్య ప్రచారాలు మానండని హితవు పలికారు ఖమ్మం నగర ప్రజలు ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు హస్తం గుర్తుపై ఓట్లు వేసి తుమ్మల ని గెలిపించుకొని ఖమ్మం అభివృద్ధికి పాటుపడ దామని అన్నారు. అనంతరం కార్పొరేటర్ కమర్థపు మురళి మాట్లాడుతూ కొనటం అమ్మటం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదని ఆ సంస్కృతి మీదనీ అమ్ముడు పోయేది మీరని ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను ఎంతకు కొన్నారో తెలపాలని మీలాగా బెదిరించడం కబ్జాలు చేయటం రాజకీయ వ్యాపారం చేసేది మీరని ఆరోపించారు మీరు ఆనాడు బి ఫారాలు ఇచ్చేటప్పుడు ప్రతి కార్పొరేటర్ తో ప కిరణ్ పేరు మీద స్టాంప్ పేపర్ లు తయారు చేసి సంతకాలు చేయించి రాజకీయ వ్యాపారం చేసింది మీరు ఇకనైనా మారండి అని హితవు పలికారు రాబోయే ఎన్నికలలో ఖమ్మం నియోజకవర్గ ఖిల్లా పై కాంగ్రెస్ జెండా రెపెపలాడిందనీ,తుమ్మల నాగేశ్వరరావు గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు నగర కాంగ్రెస్ కమిటి కార్యనిర్వాహక అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి,ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు జిల్లా ఓబిసి సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు,లకావత్ సైదులు నాయక్ రఫేదా బేగం షేక్ జానబీ తేజావత్ హుస్సేన్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,జిల్లా మైనారిటి అధ్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,నగర కాంగ్రెస్ నాయకులు చావా నారాయణరావు రావూరి సైదుబాబు మిక్కిలినేని నరేందర్ ముస్తాఫా ముక్తార్ నాగుల్ మీరా జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కొంటెముక్కల నాగేశ్వరావు నగర ఓబిసి సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్ నగర అధ్యక్షులు నరాల నరేష్ నగర ఎస్టి అధ్యక్షులు శంకర్ నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు
