కాలిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్.ఎండుతున్న పంటలు ఆందోళనకు గురవుతున్న రైతులు

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ఆరుగాలం కష్టపడి పండిస్తున్న వరి పంట చేతికి వచ్చే సమయంలోనే ఎండి పోతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కష్టపడి వేసిన వరి పంటకు నీళ్లు లేక ఎండి పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండల కేంద్రమైన ముధోళ్లోని ఎల్వత్ రోడ్డు సమీపంలోని 64కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గత 15 రోజుల క్రితం కాలిపోయింది. సంబంధిత అధికారుల దృష్టికి సైతం రైతులు సమస్యను తీసుకెళ్లారు. సిబ్బంది విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించిన కనెక్షన్లను తొలగించి తీసుకెళ్లడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వరి పంట కంకులు నిండే సమయం కావడంతో నీళ్లు ఎంతో అవసరమని రైతులు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని, సకాలంలో ట్రాన్స్ఫార్మర్ను బిగించడం వల్ల రైతుల సమస్య తీరుతుందని పేర్కొన్నారు. అయితే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే దాదాపు 150 ఎకరాల వరకు వరి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని రైతుల ఆందోళన చెందుతున్నారు. రాత్రనకా పగలనకా కష్టపడి పంటను సాగు చేసామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి వేసిన పంట ఎండిపోతే తమ పరిస్థితి దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సకాలంలో స్పందించి ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మతు చేసి వరి పంట ఎండిపోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking