బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం.

నియంతృత్వ కేసీఅర్ కు ఓటుతో బుద్ధి చెప్పాలి.
డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు.
గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన చించోలి (బి) ఎంపీటీసీ.

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్లలో అన్యాయం చేశారని నిర్మల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. సారంగాపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామానికి చెందిన ఉద్యమకారుడు ఎంపీటీసీ వెంకట్ రామ్ రెడ్డి అధికార బిఆర్ఎస్ పార్టీకి గురువారం రాజీనామా చేసి జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ట్రాన్ని సాధించుకుంటే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలేని ముఖ్యమంత్రి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు చేసింది ఏమీ లేదని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా సకాలంలో వేతనాలు ఇవ్వలేని ప్రభుత్వమని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బహుమతి ఇద్దామని అన్నారు.నిర్మల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు

Leave A Reply

Your email address will not be published.

Breaking