విద్యార్థులకు బస్సు పాస్‌ అందజేయడం జరిగింది

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 05 అక్టోబర్ 2023: మనసున్న మహారాజులు మానస ఐషిత కమ్యూనిటీ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు అభిలాష్, సభ్యులు విష్ణు, రవి, నిఖిలేష్ బుదవారం రోజున మణికొండ మునిసిపాలిటీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలకు విచ్చేసి శారీరకంగా ఎదుగుదల లేని పిల్లలకు, వికలాంగులకు, మానసికంగా పరిపక్వం చెందని పిల్లల కోసం తరగతి గదుల విభజన గోడ నిర్మాణం కోసం వారి తరపున చేపించటం జరిగింది మరియు 1వ తరగతి నుండి 5వ తరగతి చదివే పిల్లలందరికీ ఒక్కొక్కరికి 50 రూపాయలు వెచ్చించి 213 మంది విద్యార్థులకు బస్సు పాస్‌ అందజేయడం జరిగింది. ఈ కార్య క్రమంలో మణికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీ.ఆర్.యస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, హెడ్ మాస్టర్ మంగ్యా నాయక్ మరియు ఇతర నాయకులు శ్రీరాములు, వసంత్ చౌహాన్, శ్రవణ్ కుమార్, శ్రీకాంత్, కుమార్, దిలీప్, డిపో కంట్రోలర్ ధర్మేంద్ర, ఉపాధ్యాయులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking