లక్షెట్టిపేటలో బస్ షెల్టర్ లు నిర్మించాలి

 

అంబేద్కర్ చౌరస్తా,ఎన్టీఆర్ చౌరస్థాల్లో అత్యవసరం

అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తొగరు రాజు

మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేత

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 03: మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా,కరీంనగర్ చౌరస్థాల్లో బస్ షెల్టర్ లు నిర్మించాలని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తొగరు రాజు మున్సిపల్ అధికారులను కోరారు.సోమవారం పట్టణంలో అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ రాజశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…పట్టణంలో ఎండలు పెరిగిపోయాయని, గత సంవత్సరం తమ విజ్ఞప్తి మేరకు తాత్కాలిక షెడ్డు వేశారన్నారు.కానీ ఈ సంవత్సరం ఇంకా షెడ్లు వేయలేదన్నారు. వివిధ పనుల రీత్యా చిన్న పిల్లలు,వృద్ధులు, మహిళలు నిత్యం ప్రయాణిస్తరన్నారు.కాబట్టి వెంటనే ఆయా కూడళ్ళలో బస్ షెల్టర్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు చిప్పకుర్తి నారాయణ,మాలెం చిన్నన్న, సీనియర్ నాయకులు గోల్కొండ సత్తయ్య,పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్,పెండెం సత్తయ్య, వేముల ప్రేంసాగర్, చామనపల్లి కిషన్,తిమోతి,పట్టణ ఉపాధ్యక్షుడు కండె మొగిలి,దేవి మోహన్,నీరటి మొగిలి,కంకునాల చిన్నయ్య, పెండెం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking