ప్రజాబలం వరంగల్ ప్రతినిధి ఫిబ్రవరి29:
క్యాంపస్ అంబాసిడర్లు ఓటర్ల నమోదుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు.
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్యాంపస్ అంబాసిడర్ గా గుర్తించిన విద్యార్థిని, విద్యార్థుల తో జరిగిన ఓటర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఓటర్లలో సమర్ధవంతంగా చైతన్యం కల్పించుటకు పలు సూచనలు చేశారు. కాలేజీలో బృందాలుగా ఏర్పడి అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్ అవగాహనతో పాటు 18 సంవత్సరాలు పూర్తి అయిన యువతి యువకులు ఇప్పటి వరకు ఓటరు గుర్తింపు కార్డు నమోదు చేయనట్లైతే ఫామ్ 6 ద్వారా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లో విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు ఎక్కువగా సంచరించు ప్రాంతాలైన బస్ స్టేషన్ , రైల్వే స్టేషన్, మార్కెట్ పరిసరాల్లో ఫ్లాష్ మాబ్, స్కిట్ తదితర వినూత్న కార్యక్రమాల ద్వారా ఓటర్లలో అవగాహన కల్పించి ఓటరు శాతాన్ని పెంచే విధంగా ప్రజల్లో చైతన్యం కల్పించాలని అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల సురక్షిత, భద్రతపై ఓటర్లలో అవగాహన కల్పించాలన్నారు.
గత శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గుటకు అర్బన్బ్ యూత్ కారణమని , తక్కువ వోటింగ్ జరిగిన పోలింగ్ కేంద్ర ప్రాంతంలో ప్రత్యేక వహించాలని అన్నారు.
రానున్న లోకసభ ఎన్నికల్లో ఇలాటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రజలు, యువకుల్లో చైతన్యం కల్పించాలన్నారు.
ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలిసేలా జిల్లాలోని ప్రతి డిగ్రీ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ప్రజలకు, యువతకు అవగాహన కల్పించుటకు తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో స్వీప్ నోడల్ ఆఫీసర్, జిల్లా ఎస్సి సంక్షేమ శాఖ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నరసింహమూర్తి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ , జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రావు, జిల్లా లోని డిగ్రీ కాలేజీల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.