మణికొండ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానం ఆప గలిగేనా ?

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 19 ఫిబ్రవరి 2024:
మణికొండ కౌన్సిల్ ఏర్పడిన 4 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడా లేని విధంగా చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ కి చెందిన కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ గా బీ.జే.పీ పార్టీ కి చెందిన కే. నరేందర్ రెడ్డిలు అధికారం పాలు పంచుకొని కొన సాగుతుండగా, పార్టీలకు అతీతంగా 20 వార్డులకు గాను 10 మంది కౌన్సిలర్లు చైర్మన్ ఒంటెద్దు పోకడలకు కళ్ళెం వేసేలా ఏక లక్షంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన దరిమిలా కలెక్టర్ ఆమోదించి ఈ నెల 22న ముహూర్తం ఖరారు చేయడ మైనదని, రాజకీయాలలో గత కొన్ని దశాబ్దాలుగా ఏక చత్రాది పత్యంగా ఏలుబడి చేస్తున్న కుటుంబానికి చెందిన కస్తూరి నరేందర్ స్వంత రాజకీయ అనుభవంతో తనదైన శైలిలో కౌన్సిల్ అవిశ్వాస తీర్మాన సమావేశం జరుగడానికి గాను కనీసం 13 మంది కౌన్సిలర్లు హాజరు కావలసి ఉండగా ఎట్లాగైన ముగ్గురు కౌన్సిలర్లు హాజరు కాకుండా చేసి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఏకంగా విచ్ఛిన్నం గావించడానికి గాను ఏర్పాట్లు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం, ఇందుకు ప్రత్యర్థి వర్గం వారు తమ జట్టు సంఖ్య తగ్గకుండా ఉండేందుకు గాను రోజు కొక స్థలంలో వేసవి విడిది పర్యటనలు గావిస్తు పైపెట్చు తటస్థంగా ఉన్న ముగ్గురితో పాటు చైర్మన్ కు విరుద్ధంగా వున్న మరో ముగ్గురితో కలపి భారీ మెజారిటీతో అవిశ్వాసాన్ని నెగ్గించు కున్న తదుపరి వైస్ చైర్మన్ మరియు క్రొత్తగా వచ్చిన కమిషనర్ పర్యవేక్షణలో తమలో ఒకరిని సామరస్య పూర్వకంగా చైర్మన్ పదవికి ఎన్నుకొంటారని సమాచారం అందింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking