నూతనంగా చైర్మన్ గా ఎన్నికైన కొండ విజయ్ ని సన్మానించిన మిత్రబృందం.

జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి ఫిబ్రవరి 19 ఇటీవల ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామ శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి దేవాలయం నూతన చైర్మన్ గా ఎన్నికైన కొండ విజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సోమవారం జమ్మికుంట స్రవంతి కళాశాల లో మిత్రబృందం ఘనంగా సన్మానించటం జరిగింది. ఈ సందర్బంగా మిత్రులు మాట్లాడుతూ భవిష్యత్తు లో మరిన్ని ఉన్నత శిఖరాలు సాధించాలని గ్రామానికి మంచి పేరు ప్రతిష్ట లు తీసుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమం లో స్రవంతి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు, మిత్రులు రహమాన్, మొహమ్మద్ అంకూస్, ఉదయ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking