రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 19 ఫిబ్రవరి 2024:
మణికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ సమయానంతర అదనపు తరగతులకు హాజరయ్యే 206 మంది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రంపు అల్పాహారంగా వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రయత్నాలకు అన్హూయ స్పందన లభిస్తున్నదని, మొదటగా ట్రస్ట్ సభ్యులు ముందుకురాగా, మణికొండ నార్సింగి రోడ్ బీ.ఆర్.సి కి ఎదురుగా గల గోల్డెన్ ఒరియోల్ అపార్ట్మెంట్ నివాసులైన వరిష్ఠ నాగరికుల సంఘం వారు మొత్తం 10 రోజుల అల్పాహార సరఫరా వ్యవస్థ చేయడానికి ముందుకురాగ, 5 రోజుల అల్పాహార వ్యవస్థ చేయడానికి ఆల్ కాలనీ ఫెడరేషన్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ దంపతులు వ్యవస్థ ఏర్పాటు చేసినారని, ప్రస్తుతం మణికొండ నార్సింగి రోడ్లో గల స్కైల గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ నివాసులు కూడా సన్నిద్దులు అవుతున్నారని ట్రస్ట్ తరపున అందె లక్ష్మణ్ రావు తెలియ పరుస్తు నేడు సోమవారం రోజున సమతూల్యమైన పౌష్ఠికాహారపు ధాన్యాలతో చేసిన అల్పాహారాన్ని పంపిణీ చేయడం జరిగినదని ఇట్టి కార్యక్రమానికి ట్రస్ట్ సభ్యులు, అల్పాహార దాతలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిరంజన్, పాఠశాల టీచర్లు ఆదిగా పాల్గొన్నారని, ఈ సందర్భముగా మానవత ద్రుపకంతో ముందుకు వస్తున్న అందరి దాతలకు హృదయ పూర్వక కృతజ్ఞతాభీ వందనములు తెలియ జేసినారు.
