ఖమ్మంలో ఆటోమోటివ్ కార్ ఆక్ససిరీస్ ప్రారంభం

 

రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 19 (ప్రజాబలం) ఖమ్మంలో ఆటోమోటివ్ కార్ ఆక్ససిరీస్ ఖమ్మం నూతన షోరూమ్ ను రాష్ట్ర రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ & సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు కార్ స్పేర్ పార్ట్స్ ఆండ్ ఆక్స సిరీస్ రంగంలో మెట్రోపాలిటన్ నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా ఖమ్మం నగరం వర్తక , వాణిజ్య వ్యాపార రంగాలలో మరింత విస్తరించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.. ఖమ్మం యువకులు ఈ రంగంలో తమ ప్రావిణ్యతను మరియు అనుభవాన్ని జతకలిపి వినియోగదారులకు నాణ్యమైన సేవలను మన్నికైన వస్తువులను అందించి వినియోగదారుల మన్ననలు పొందినప్పుడే తమ వ్యాపారాలు లాభసాటిగా ఆప్యాయతతో కొనసాగుతాయని మంత్రి పొoగులేటి అన్నారు. సంస్థ యజమానులు జావీద్, ఇమ్రాన్ ఇద్దరు కలిసి సంస్థను ఏర్పాటు చేసుకుని ఆటోమోటివ్ కార్ ఆక్సిసిరీస్ నూతన షోరూమ్ సేవలను మరిన్ని బ్రాoచులుగా విస్తరించే విధంగా కృషి చేయాలని మంత్రి పొంగులేటి ఆకాంక్షించారు.. షోరూమ్ ప్రారంభం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కు జావీద్ ఇమ్రాన్ లు శాలువాతో ఘనoగా సత్కరించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking