కుల గణనపై అసెంబ్లీ తీర్మానం పట్ల హబ్సిగూడా డివిజన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు పూలే చిత్రపటానికి పాలాభిషేకం.

 

రాష్ట్రంలో సమగ్ర కుల సర్వేకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కరిపే అనిల్ కుమార్ వంజరి హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీలో ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రంలోని అన్ని కులాల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల రామంతపూర్ పెద్ద చెరువు దగ్గర కాంగ్రెస్ పార్టీ మరియు కరిపే అనిల్ కుమార్ వంజరి ఆధ్వర్యంలో ఫూలే చిత్ర పటానికి పాలాభిషేకం కార్యక్రమానికి నిర్వహించి పూల మాలలు వేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరిపే శంకర్ వంజరి, జలీల్ పాషా, రామంతపూర్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking