దిగ్విజయంగా వడుప్స టెన్త్ ఒరియెంటెషన్

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 17:

పదవ తరగతిలో విద్యార్థులు 10కి 10 పర్సంటేజీతో ఉత్తీర్ణులు కావాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే విద్యార్థులకు సూచించారు.
శనివారం ఉర్సు గుట్ట వద్ద గల నాని ఏసీ గార్డెన్లో వడుప్స వరంగల్ జిల్లాకమిటీ ఆధ్వర్యంలో స్కూల్స్ ఎస్ఎస్సి విద్యార్థులకు స్టేట్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఓరియెంటెషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె, వరంగల్ జిల్లా విద్య అధికారి వాసంతి, వరంగల్ ఎంఈఓ కే విజయ్ కుమార్, వడుప్స జిల్లా ప్రతినిధులతో కలిసి సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఓరియంటేషన్ ప్రోగ్రాం ప్రారంభించరూ.వరంగల్ జిల్లా అధ్యక్షులు అంకటి వీరస్వామి అధ్యక్షతన జరిగిన ఈ ఓరియెంటేషన్ ప్రోగ్రాంలో వరంగల్ జిల్లా అన్నీ మండలాల నుంచి సుమారు 70 పాఠశాలలో, దాదాపు 1500 మంది ఎస్ఎస్సి విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం సెషన్లో మూడు సబ్జెక్టులో స్టేట్ పర్సన్స్ తో, మధ్యాహ్నం నాలుగు సబ్జెక్టులు రిసోర్స్ పర్సన్తో విద్యార్థులకు పరీక్షల్లో ఎంతగానో ఉపయోగపడే టిప్స్ బోధించరూ. అనంతరం పాల్గొన్న విద్యార్థి విద్యార్థులందరికీ పరీక్ష ప్యాడ్స్, పెన్స్ , లక్కీ డిప్ విజేతలకు కమిటీ ద్వారా బహుమతులు అందజేసారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ మాట్లాడుతూ తన పాఠశాల విద్యార్థి అనుభవాలను గుర్తు చేసుకుంటూ తను పదిలో చదివినప్పటి కొన్ని మేలకువలు గురించి పిల్లలకు వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు తాను మొదటిసారిగా చూస్తున్నానని ఎస్ఎస్సి విద్యార్థిని, విద్యార్థులకు 10 బై 10 సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇలాంటి ఓరియెంటెషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా కమిటీ మొత్తాన్ని హృదయపూర్వకంగా అభినందించిన ఆమె పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేసినారు. టెన్త్ విద్యార్థులు వార్షిక పరీక్షలు ఉత్తమ ఫలితాలు సాధించుటకు వడుప్స జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ ప్రోగ్రాముని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రంలో వరంగల్ జిల్లాను ఎస్ఎస్సి వార్షిక ఫలితాలలో ప్రథమ స్థానంలో నిలపాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం జిల్లా గౌరవ అధ్యక్షులు ఆడెపు శ్యామ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పట్టుదలతో చదివి 10 పై పది సాధించాలని కోరారు. విద్యార్థులు టెన్త్ వార్షిక పరీక్షలలో పది కి పది సాధించడానికి పట్టుదల, కృషి తో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతతతో చదువుపై శ్రద్ధ పెట్టి తల్లిదండ్రుల అభిలాష మేరకు పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని మన జిల్లాను ఉత్తమ ఫలితాలలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవాలని డీఈవో వాసంతి విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వడుప్స వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిళ్ళ. రవి,కోశాధికారి ఠాగూర్ జ్ఞానేశ్వర్ సింగ్, జిల్లా ముఖ్య సలహాదారులు యన్ వెంకటేశ్వర్ రావు, సలహాదారులు కొడం శ్రీధర్ ,పొన్నోజు. చక్రపాణి, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎ.సతీష్ కుమార్, జిల్లా అకాడమిక్ కన్వీనర్ మడిపెళ్లి.రాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆడెపు.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు యన్.కిరణ్ కుమార్, కిలా వరంగల్ జోన్ అధ్యక్షులు ముక్కెర.రవీందర్ గారు, ప్రధాన కార్యదర్శి దాసి సతీష్ మూర్తిగారు, వరంగల్ జోన్ కోశాధికారి కూరపాటి మోహన్, ఉపాధ్యక్షులు కూచన క్రాంతికుమార్, కన్వీనర్లు రంగు.మాధవి, కూచన కవిత , జిల్లా నాయకులు సంగ వెంకట్రాజం, కోడిమల రవి, ముల్క శరత్ బాబు,నందాల చందర్ బాబు, గోవిందరాజులు, యుగేందర్ రాజు, యాద విద్యాసాగర్,ఇనాయత్, ఖళీల్, సమీర్ , రామ భాస్కర్,సుగుణాకర్, వివిధ పాఠశాలల కరస్పాండెంట్స్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking