అభ్యర్ధులు ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాలి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధుల ఎన్నికల ఖర్చు వివరాలను రీకన్సిలేషన్ చేసి కేంద్ర ఎన్నికల కమీషన్ కు సమర్పించడం జరుగుతుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు నియమించబడిన కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు ప్రేమ్ ప్రకాష్ మీనా గారు మరియు నాగ్వీ బలాసాహెబ్ బాపురావు గారు అన్నారు.

శుక్రవారం నాడు వారు జిల్లా సహకార అధికారి, జిల్లా ఎన్నికల వ్యయ నోడల్ అధికారి ఆర్ .శ్రీనివాస మూర్తి తో కలిసి కలెక్టరేటులోని కాన్ఫరెన్స్ హాలులో గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధులు, ప్రతినిధులతో సమావేశమై ఎన్నికల ఖర్చుల వివరాలను పరిశీలించారు. అభ్యర్ధులు ఎన్నికల వ్యయాన్ని వారు నామినేషన్ వేసిన తేదీ నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 3 వ తేదీ వరకు అయిన ఫైనల్ ఖర్చు వివరాలను ముప్పది రోజులలో సమర్పించాలని, వాటిని పరిశీలించి కేంద్ర ఎన్నికల కమీషన్ కు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి అభ్యర్ధులు తమ పూర్తి తుది ఖర్చుల వివరాలను అందచేయాలని వారు సూచించారు.

కార్యక్రమంలో జిల్లాలోని ఐదు నియోజక వర్గముల అసిస్టెంట్ ఎక్సైండీచర్ అబ్జర్వర్లు నాగేశ్వర రావు, శ్రీనివాస్ రాజు, ఆంజనేయులు,రామచంద్ర,మరియు రవి గారలు తదిరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking