జనవరి 3 నుండి 9 వరకు జాతీయ బ్యాట్మెంటన్ టోర్నమెంట్

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటును నిర్వహిస్తున్నట్లు MK’S చీఫ్ కోచ్, తెలంగాణ బ్యాట్మెంటన్ ఆఫ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హర్ష తెలిపారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 19 బాల బాలికలకు టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనవరి 3 నుండి 9 వరకు టోర్నమెంట్ జరుగుతుందని అన్నారు. సికింద్రాబాద్ లోని రైల్వే RRC ఇండోర్ స్టేడియంలో పోటీలు జరుగుతాయి అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఈ టోర్నమెంట్ లో గెలిచిన వారికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా హర్ష తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యాచ్ కంట్రోలర్ పివిఎల్ కుమార్, డిపిఎస్ హెచ్వోడి జీవన్ కుమార్, శీతల్ మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking