ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 31 : ప్రభుత్వం చేపట్టిన 2వ విడత రుణమాఫీ పథకంలో హరత గల ప్రతి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రుణమాఫీ నగదు చెల్లింపు జరిగేలా బ్యాంక్ అధికారులు చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖను ఆకస్మాతిక సందర్శించి రుణమాఫీ నగదు చెల్లింపు ప్రశ్నించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…రైతు రుణ మాఫీ 2వ విడత 1 లక్ష రూపాయల నుంచి 1.50 లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చెందేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లా లోని రైతు రుణ మాఫీ పథకం 14 వేల 104 మంది రైతులకు 138 కోట్ల 46 లక్షల 56 వేల 254 రూపాయలు అందించడం జరుగుతుందని, తెలిపారు. రుణ మాఫీ మొదటి విడతలో 28 వేల 727 మంది రైతులకు 151 కోట్ల 27 లక్షల19 వేల 35 రూపాయలు అందించడం జరుగుతుందని తెలుపారు.రుణ మాఫీ నగదు మొత్తాన్ని రైతుల ఖాతా లలో జమ చేయడం జరుగుతుందని,బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారి సమస్యలతో వ్యవహారించి బ్యాంకు లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా నగదు మొత్తాన్ని రైతుల ఏమైనా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 0836-250501 ఏర్పాటు చేయడం జరిగిందని, మండల వ్యవసాయ అధికారి కార్యాలయం లో కూడా సంప్రదించవచ్చని,మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటూ రైతులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.రుణమాఫీ అమలు అయిన తరువాత సంబంధిత ఖాతా ద్వారా తిరిగి రుణం పొందవచ్చునని, రైతులు అవకాశాన్ని సద్వినియోగంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలుపారు. బ్యాంకు అధికారులు, సిబ్బంది రైతుల పట్ల మర్యాదగా నడుచుకోవాలి, జవాబుదారీతనంతో వ్యవహరించాలని,2వ విడత రుణమాఫీ పథకాన్ని నిర్ణిత సమయంలోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం మండల తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి దరఖాస్తు పరిశీలన తీరును పరిశీలించారు. వ్యవసాయ భూములకు సంబంధించిన వివిధ రకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అభ్యర్థులు ధరణి పోర్టల్ లో చెసుకుంన్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసె విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.భూముల సర్వే నెంబర్లు,విస్తీర్ణం, పేర్లు, ఇతర వివరాల మార్పుల సవరణ కొరకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, పట్టా మార్పు కోసం అందిన దరఖాస్తులతో చేత చేసిన ధ్రువపత్రాల వివరాలను భౌతికంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని పట్టా మార్పు కోసం అందిన దరఖాస్తులతో జత చేసీన ధృపత్రాల వివరాలను భౌతికంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని పట్టా మార్పు కోసం అందిన దరఖాస్తులతో జత చేసీన ధృపత్రాల వివరాలను భౌతికంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సమగ్ర వివరాలు జరిపి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రత్యేక చెక్లిస్టు ప్రకారం వివరాలు నమోదు చేయాలని దరఖాస్తు తిరస్కరించే సమయంలో దరఖాస్తులకి కారణం తెలిపే విధంగా కాలంలో వివరాలు నమోదు చేయాలని తెలిపారు, కులం ఆదాయం నివాసం కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ఇతరత్రా ధృవపత్రాల కొరకు అందిన దరఖాస్తులను నిబంధన మేరకే త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్ రావు,దేశ్ పాండే, బ్యాంకు అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.