ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతా ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్ రెడ్డి పన్నాల
ఖమ్మం ప్రతినిది ఫిబ్రవరి 18 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణ జన సమితి బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి గోపాల్ రెడ్డి పన్నాల కు మొదటి (1) ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ నెంబర్ 8 పై వేసి గెలిపించాలని కోరారు . తను ఉద్యమ సేవకుడు అని , ఆయన పని చేసిన ప్రతి పాఠశాలను అంకితభావంతో అభివృద్ధి చేసి ఉత్తమ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు ఉండి ఏపీటీఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని పరిష్కరించడం జరిగిందని , పదవి విరమణ పొందిన తర్వాత కూడా ఉపాధ్యాయ ఉద్యమంతో పాటు పౌరుడిగా సామాజిక సమస్యల పట్ల స్పందించి పనిచేస్తున్నానని కావున తనకు మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకరరావు , జిల్లా కన్వీనర్ వి.బాబు , ఖమ్మం జిల్లా టీజేఎస్ నాయకులు ఎస్.కె సర్దార్ , బెల్లంకొండ నాగేశ్వరరావు , జంగాపల్లి రవి , బట్టు రాజేందర్ నాయక్ , గుర్రాల నాగేంద్రరావు , ప్రసాద్ , నరసింహారావు , నల్గొండ జిల్లా టీజేఎస్ ప్రధాన కార్యదర్శి గుండెబోయిన నాగేశ్వరరావు , యాదవ్ కట్ల జగన్నాథం , ప్రవీణు తదితరులు పాల్గొన్నారు
